Pushpa 2 : పుష్ప -2 ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఫిక్స్.. ఈసారి సమంతకు మించి!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్ కోసం ఫిక్స్ అయినట్లు సమాచారం.
సుకుమార్ సినిమా అంటేనే కథ ఎలాంటిదైనా సరే అందులో ఐటెం సాంగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా రామ్ చరణ్, సమంత కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమాలో కూడా పూజా హెగ్డే తో ఐటెం సాంగ్ పెట్టించి, తన మార్క్ చూపించకున్నారు సుకుమార్.
ఆ తర్వాత పుష్ప: ది రైస్ సినిమాలో ఏకంగా సమంతాతో ఐటమ్ సాంగ్ చేయించి ఆకట్టుకున్నారు . ఊ అంటావా మావ అనే ఐటమ్ సాంగ్ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అటు జనాలను కూడా ఈ పాట చాలా ఊపేసింది. ఇప్పుడు పుష్ప-2 లో కూడా మరో ఐటెం సాంగ్ ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. అయితే విడుదలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే ఉండగా ఈ పాటను ఇంకా చిత్రీకరించలేదు.
దీంతో ఈ పాటలో ఎవరు నర్తించబోతున్నారు అంటూ నెటిజన్స్ సైతం ఆతృతగా ఎదురు చూస్తుండగా.. చివరికి తెరపైకి వచ్చిన పేరు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇటీవల స్త్రీ 2 తో బ్రేకింగ్ రికార్డు సొంతం చేసుకున్న ఈమెకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఈమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు కూడా వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం హిందీలో ఈమెకు ఉన్న మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు వెనుకంజ వేయకుండా అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సుకుమార్ బాలీవుడ్ లో క్రేజ్ తీసుకురావడానికి శ్రద్ధ కపూర్ ను ఇందులో ఐటమ్ సాంగ్ లో నటింప చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా శ్రద్ధా కపూర్ ఐటమ్ సాంగ్ చేసింది అంటే అక్కడ జనం మరింత ఊగిపోతారనటంలో సందేహం లేదు. ఇకపోతే ఈ పాటకు గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూరుస్తారని, దేవి శ్రీ ప్రసాద్ మంచి ఊపున్న పాటనే కంపోజ్ చేశారని సమాచారం. మరి శ్రద్ధా కపూర్ ఇందులో నటిస్తుందా లేదా అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈమె పేరు పరిశీలనలోకి రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.