Shweta Basu Prasad Photos: కొత్త బంగారు లోకం మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే?
'కొత్తబంగారు లోకం' సినిమాతో పేరు తెచ్చుకున్న హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది.
కొన్ని సంవత్సరాల ప్రేమ అనంతరం, 2018లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది. అనివార్య కారణాల వల్ల అతడి నుంచి విడిపోతున్నట్లు శ్వేతా.. గతేడాది ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది.
కోర్టు నుంచి విడాకులు తీసుకునేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శ్వేతాబసు ప్రసాద్.. ఓ ఆంగ్ల పత్రికతో తన వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించింది.
పరస్పర అంగీకారంతోనే రోహిత్ మిట్టల్ నుంచి తాను విడిపోయినట్లు శ్వేత చెప్పింది. గతే ఏప్రిల్‌లో భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జీవితంపై వచ్చిన 'ద తాష్కెంట్ ఫైల్స్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిందీ భామ.