Actress Sneha Birthday : నటి స్నేహా బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యామిలీ పిక్స్ వైరల్
నటి స్నేహా బర్త్ డే సందర్భంగా అలా ఫ్యామిలీ అంతా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలితో కలిసి స్నేహా ఫుల్ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. స్నేహా పిల్లలను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం స్నేహా బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయింది. మిస్టర్ అండ్ మిసెస్ అనే షోకు అనిల్ రావిపూడితో పాటుగా స్నేహా జడ్జ్‌గా వచ్చేసింది.
స్నేహ, తన భర్తతో కలిసి ప్రకటనల్లో నటిస్తుంటుంది. అలా కొన్ని ఉత్పత్తులకు స్నేహా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు స్నేహా మళ్లీ బుల్లితెరపై ఫుల్ బిజీగా మారనుంది.
తమిళంలోనూ స్నేహ మంచి చిత్రాలను చేసింది. అయితే స్నేహ అక్కడే ప్రసన్నతో ప్రేమలో పడింది. చివరకు అది పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి తరువాత స్నేహా ఎక్కువగా సినిమాల్లో చేయలేదు.
స్నేహాకు తెలుగు, తమిళంలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. స్నేహకు తెలుగులో హోమ్లీ హీరోయిన్ అనే ఇమేజ్ ఉంది. శ్రీకాంత్‌తో ఎక్కువ చిత్రాలు చేసింది స్నేహా.