Sonal Chauhan Pics: గోల్డెన్ డ్రెస్‌లో సోనాల్ చౌహాన్.. బాలయ్యబాబు హీరోయిన్ మాములుగా లేదుగా!
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే సోనాల్ చౌహన్.. తరచుగా తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా సోనాల్ హాట్ ట్రీట్ ఇచ్చారు.
ఇటీవల సోనాల్ చౌహన్ 'ఎఫ్ 3' సినిమాలో కీలక పాత్రలో నటింకాహారు. కింగ్ నాగార్జున సరసన 'ది గోస్ట్' సినిమాలో లీడ్ రోల్ ప్లే చేశారు.
మంచి అందం, అభినయం, ఫిజిక్ ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్ అని చెప్పొచ్చు. ఎందుకో తెలియదు కానీ తెలుగు దర్శక నిర్మాతలు ఆమెని పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగులో ఎందరి హీరోలతో నటించినా.. నందమూరి బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో సోనాల్ ఆకట్టుకున్నారు.
మోడలింగ్‌లో రాణించిన సోనాల్ చౌహాన్ హిందీ సినిమా జన్నత్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
1989 మే 16న యూపీలోని బులంద్షహర్‌లో సోనాల్ చౌహాన్ జన్మించారు. నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆపై న్యూ ఢిల్లీలోని గార్గి కాలేజీలో ఫిలొసఫి పూర్తి చేశారు.