Actress Soundarya: నటి సౌందర్య భర్త రెండో భార్య ఎవరో తెలుసా.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Wed, 07 Aug 2024-3:19 pm,

Actress Soundarya:ఆమెను చూడగానే సగటు భారతీయ మహిళ కనబడుతుంది. ఒక ప్రేమికురాలిగా.. ఇల్లాలిగా... భక్తురాలిగా...తల్లిగా.. తనదైన సాత్వికాభినయంతో  ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆమె కంటూ ప్రత్యేకమైన అభిమానులున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఈమె తన గ్లామర్ కంటే నటనతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు. నటి సౌందర్య భర్త: సౌందర్య గాని నటి సౌందర్య తనకంటూ భారీ అభిమానులను కలిగి ఉంది.

 

సుమారు దశాబ్దం పైగా తెలుగు, తమిళం సహా సౌత్ సినీ ఇండస్ట్రీపై  బలమైన ముద్ర వేసి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సౌందర్య.ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే 2003లో తన చిన్ననాటి స్నేహితుడైన రఘుని పెళ్లి చేసుకుంది.

పెళ్లైన యేడాదిలోపే 2004లో బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెంది అభిమానులను శోక సంద్రంలో ముంచి వెళ్లారు.

రఘు తన భార్య సౌందర్య జ్ఞాపకార్థం ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు భార్య సౌందర్య   పేరు మీద స్కూల్ నడుపుతూ తన వంతుగా సామాజిక సేవ చేస్తున్నాడు.

సౌందర్య మరణం తర్వాత ఆమె భర్త రఘు .. గోవాకు చెందిన డాక్టర్ అర్పితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు విదేశాల్లో ఎన్నోహాస్పిటల్స్ ఉన్నాయట. ప్రస్తుతం ఇతను తన భార్యతో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు.

సౌందర్య తెలుగు,కన్నడ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో టాప్ స్టార్స్  సరసన నటించారు. ఆమె మన నుంచి దూరమై దశాబ్దాలు గడుస్తున్న ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link