Sreeleela Pics: రెడ్ టాప్‌లో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న శ్రీలీల, లేటెస్ట్ పిక్స్ వైరల్
శ్రీలీల డిమాండ్ రోజు రోజుకు తగ్గుతున్న ఆమె గ్లామర్ పెరిగిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గులాబీ డ్రెస్ లో సందడి చేసింది. ఈ అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
శ్రీలీలకు గత కొంత కాలంగా సరైన హిట్ లేదు. వరుస ఫ్లాపులతో ఈ బ్యూటీ కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ కూడా తగ్గిపోతున్నాయి.
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో పవర్ స్టార్ సరసన ఈ బ్యూటీ అలరించబోతుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ బ్యూటీకి వరుసగా అపజయాలు ఎదురవ్వడం, అవకాశాలు తగ్గడంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని ఈ భామ అనుకుంటుందట.
మరోవైపు సోషల్ మీడియాలో పుల్ యాక్టివ్ గా ఉంటున్న శ్రీలీల తన అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.