Tabu: టబు కి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని.. గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న నటి టబు. హిందీలో మాత్రమే కాక తెలుగులో కూడా ఈమె ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. నాగార్జునతో ఆమె నటించినా హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడుతా వంటి సినిమాలను ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుతెచ్చుకుంటూ ఉంటారు.
టాలీవుడ్ తో మాత్రమే కాక హైదరాబాద్ తో కూడా ఆమెకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. టబూ తన చిన్నతనం మొత్తం హైదరాబాద్లోనే గడిపింది. ఇక్కడే మల్లెపల్లి ప్రాంతంలో తన అమ్మమ్మ తాతయ్యలతో కలిసి చాలా కాలం ఉన్న టబు.. విజయనగర్ కాలనీలోని సెంట్ ఆన్స్ హై స్కూల్ లోనే చదువుకున్నారు. తను ముందు హైదరాబాదిని అని.. ఆ తరువాత బాలీవుడ్ నటిని అని చాలాసార్లు చెబుతూ ఉంటారు టబు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్లో ఆమెకు ఉన్న ప్రాపర్టీ ల గురించి.. రియల్ ఎస్టేట్లో ఆమె పెట్టిన పెట్టుబడుల గురించి కూడా ప్రస్తావించారు. "మీకు హైదరాబాద్లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్, బంగ్లా కూడా ఉన్నాయట కదా" అని ఇంటర్వ్యూయర్ అడగగా టబూ ఆమె నవ్వేసి.. "ఇదంతా మా ఆంటీ దగ్గర నుండి వచ్చింది. ఆమె టబు ఇంటి యజమాని అయిపోయింది అని చెబుతుంది" అని అన్నారు.
ఇక రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతూ అందులో ఆమె పెట్టిన పెట్టుబడుల గురించి కూడా చెప్పుకొచ్చారు టబు. ఇంటి యజమానిగా ఆమెకి మరొక జీవితం ఉంది అన్న టబు.. వివిధ ప్రాపర్టీ ల నుండి రెంట్ తీసుకోవడం వాటిని మానేజ్ చేయడం వంటివి చేస్తూ ఉంటానని అన్నారు టబు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఆమెకి ఒక విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. 2000 సమయంలోనే ఆమె ఈ బంగ్లాను కొనుగోలు చేశారు.
తెలుగులో అల వైకుంఠపురంలో సినిమాలో కనిపించిన టబు.. హిందీలో ఈ మధ్యనే క్రూ అనే సినిమాలో కనిపించారు. త్వరలో ఆమె డ్యూన్ ప్రొఫెసీ అనే ఒక ఇంటర్నేషనల్ ప్రీక్వల్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఆమె సిస్టర్ ఫ్రాన్సెస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సిరీస్ ట్రైలర్ సిరీస్ మీద మరింత ఆసక్తి పెంచింది అని చెప్పుకోవచ్చు.