మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ
యమహా ఫాసినో మిస్ దివా 2015 పోటీలలో నటి ఊర్వశి రౌతెలా టైటిల్ సాధించింది. దీంతో విశ్వసుందరి (Miss Universe) పోటీలకు అర్హత సాధించి లక్ పరీక్షించుకుంది. అయితే అంతకుముందే పలు అందాలపోటీలో పలు కేటగిరిలలో టైటిళ్లు అందుకుంది ఊర్వశి రౌతెలా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2013లో వచ్చిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది.
మిస్ యూనివర్స్ పోటీలలో రెండుసార్లు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక బ్యూటీ ఊర్వశి రౌతెలా (Urvashi Rautela). బాలీవుడ్ నటి తరచుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. Urvashi Rautela Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.
సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి లాంటి సినిమాలతో మెప్పించింది. 2009లో మిస్ టీన్ ఇండియా టైటిల్ నెగ్గిన తర్వాత ఆమె అందాల పోటీలు, మోడలింగ్ వైపు ఫోకస్ చేసింది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా వర్జిన్ భానుప్రియ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆగిపోయింది. Urvashi Rautela పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు సైతం చేసింది. అయితే మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఊర్వశి రౌతెలా తరచుగా తన హాట్ ఫొటోలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
Images Credit: ఈ ఫొటోలను మోడల్, నటి ఊర్వశి రౌతెలా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.