Adani Power: బంగ్లాదేశ్‌కు కరెంటు సప్లై చేస్తాం..గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారమే విద్యుత్ సరఫరా : అదానీ పవర్

Fri, 16 Aug 2024-6:51 pm,

India Tightens Power Grip:బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా చేసే తాము కట్టుబడి ఉన్నామని తాజాగా అదానీ గ్రూప్‌ ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా  తమ పవర్ కంపెనీ అయిన అదానీ పవర్ బంగ్లాదేశ్ కు పవర్ సప్లై చేస్తుందని ఆ సంస్థ తన తాజా ప్రకటనలో తెలిపింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం విదేశాలకు విద్యుత్ ఎగుమతి నిబంధనలలో మార్పులు చేసింది. అయితే ప్రస్తుతం కేంద్ర రూపొందించిన నూతన నిబంధనలు, తాము గతంలో బంగ్లాదేశ్ తో జరుపుకున్న ఒప్పందాలపై ప్రభావం చూపబోవని అదానీ పవర్ తెలిపింది.   

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో నెలకొన్ని అనిశ్చితి నేపథ్యంలో విదేశాలకు విద్యుత్ ఎగుమతి చేసే విద్యుత్ సరఫరా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రధానం దేశీయ మార్కెట్‌ లో విద్యుత్‌ అవసరాలకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది. అయితే విదేశాలకు విద్యుత్ సరఫరా విషయంలో కంపెనీలు కచ్చితంగా నిబంధన పాటించాల్సిందే అనే నియమం మాత్రం కేంద్రం పేర్కొన లేదు.  దీంతో బంగ్లాదేశ్‌కు విద్యుత్‌ను ఎగుమతి చేసే అదానీ పవర్ లిమిటెడ్ ప్లాంట్‌కు ప్రయోజనం చేకూరనుంది.   

తాజాగా అదానీ పవర్ జారీ చేసిన ఒక ప్రకటనలో. "బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం అదానీ పవర్ తన బాధ్యతలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంది" అని కంపెనీ తెలిపింది.  

కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 12న జారీ చేసిన అంతర్గత మెమోలో పొరుగు దేశానికి విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ ఉత్పత్తిదారులకు ప్రత్యేకంగా రూపొందించిన 2018 మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మొమోలో ఇలా చెబుతోంది, 'భారత ప్రభుత్వం మన దేశం నుంచి విదేశాలకు విద్యుత్ సరఫరా చేసే ఉత్పాదక స్టేషన్లను భారతీయ గ్రిడ్‌కు అనుసంధానించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది.   

ఇదిలా ఉంటే జార్ఖండ్ రాష్ట్రంలోని అదానీ పవర్ కు చెందిన 1,600 మెగావాట్ల (MW) గొడ్డ ప్లాంట్ ఉత్పత్తి చేసే 100 శాతం ఎలక్ట్రిసిటీని పొరుగు దేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. విదేశాలకు విద్యుత్ సరఫరా చేసే సదుపాయం ఉన్న  ఏకైక ప్లాంట్ ఇదే కావడం విశేషం.   

ఇదిలా ఉంటే  పొరుగు దేశం బంగ్లాదేశ్ లో  రాజకీయ అస్థిరత కొనసాగుతున్న తరుణంలో ఈ మార్పు చోటు చేసుకుంది. ఇటీవలి హింసాత్మక నిరసనల తరువాత, షేక్ హసీనా దేశం విడిచి భారతదేశంలో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో  దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు ఈ చర్య దోహదపడుతుందని అదానీ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ డిమాండ్ షెడ్యూల్ , విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి అదానీ పవర్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link