Adani Stocks: గౌతమ్ అదానీకి బిగ్ షాక్..అమెరికాలో కేసు..కుప్పకూలిన షేర్లు..క్షణాల్లో లక్షల కోట్లు ఆవిరి
Effect of American Accusations: ప్రముఖ భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అగ్రదేశం అమెరికా మోపిన అభియోగాల ప్రభావం అదానీ కంపెనీల స్టాక్స్ పై ఎఫెక్ట్ పడింది. దీంతో గురువారం ప్రారంభ ట్రేడింగ్ లో అదానీ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ఎనర్జీ స్టాక్స్ 20శాతానికి పడిపోయాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను చేజిక్కించుకునేందుకు అదానీ గ్రూప్ భారత అధికారులకు దాదాపు 250 మిలియన్ డాలర్ల లంచం చెల్లించిందంటూ అమెరికా ఆరోపణలు చేసింది.
కాగా అదానీ లిస్టెడ్ కంపెనీల మొత్తం వ్యాల్యూలో రూ. 2.45లక్షల కోట్లు గురువారం ఆవిరయ్యాయి. అదానీ ఎంటర్ ప్రైజేస్ 23శాతానికి నష్టపోయాయి.
అదానీ ప్లాగ్ షిప్ కంపెనీ -అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 20శాతానికి పడిపోయాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 19.17శాతం, అదానీ టోటల్ గ్యాస్ 18.14శాతం, అదానీ పవర్ 17.79శాతం, అదానీ పోర్టులు 17.79శాతం మేర తగ్గాయి.
అంబుజా సిమెంట్స్ 14.99శాతం, ఏసీసీ 14.54శాతం, ఎన్డీటీవీ 14.37 శాతం, అదానీ విల్మార్ 10, వీటితోపాటు అదానీ గ్రూపునకు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.
అదానీ దాని సబ్సిడరీలు 20ఏళ్లలో 2 బిలియన్ డాలర్లకు పైగా లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత అధికారులు దాదాపు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించిన తర్వాత అమెరికా, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం అందించి..నిధులు సేకరించే ప్రయత్నంచేసినట్లు తెలిపారు.
మరోవైపు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అదానీపై మరో కేసు నమోదు చేసింది. అక్కడి చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించింది. దీనిపై అదానీ గ్రూప్ ఇప్పటి వరకు స్పందించలేదు.
గత ఏడాది యూఏస్ షార్ట్ సెల్లార్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అదానీ గ్రూప్ తమ షేర్లను క్రుత్రిమంగా పెంచుకుని ఇన్వెస్టర్లను మోసం చేసిందని సంచలన రిపోర్టు విడుదల చేసింది.
అదానీ గ్రూప్ మార్కెట్ విలువ అప్పట్లో ఏకంగా 150 బిలియన్ డాలర్లకు పైగా పతనం అయ్యింది.