Kriti Sanon: చమ్కీల చీరలో అదరగొట్టేసిన ఆది పురుష్ హీరోయిన్.. కృతి సనన్ మైండ్‌బ్లోయింగ్ పోజులు
Kriti Sanon In Blue Saree : ఈ మధ్యనే రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాలో జానకి పాత్రలో ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన బాలీవుడ్ భామ కృతి సనన్ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో గ్లామర్ ను వలకబోస్తోంది.
వెస్ట్రన్ డ్రెస్ అయినా.. ట్రెడిషనల్ చీరలో అయినా అందంగా కనిపించే కృతి తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బ్యాష్ కి హాజరైంది.
ఈ వేడుకలో భాగంగా కృతి సనన్ నీలి రంగు షిమ్మరీ చీరలో అందంగా కనిపించింది.
లైఫ్ మొత్తం బ్లూ బటర్ఫ్లై అంటూ సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేసింది ఈ భామ.
మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి సనన్ ఈ బ్లూ చమ్ కీల చీరలో ధగ ధగా మెరిసిపోతోంది.
స్లీవ్ లెస్ బ్లౌజు లో తన అందాలను ఆరబోస్తూ కృతి సనన్ చీరలో చాలా ట్రెండీగా కనిపించింది.
దీపావళి వెలుగు మొత్తం ఆమె కళ్ళల్లోనే కనిపిస్తోంది అంటూ నెటిజన్లు ఆమె ఫోటో పై సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు.