VFX Work: ఆదిపురుష్ సహా ఇతర సినిమాల ఫ్లాప్‌కు నాణ్యత లేని వీఎఫ్ఎక్స్ పనితీరు కారణమా
ఓమ్ రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ పని అత్యంత దారుణంగా ఉందంటూ ట్రోలింగ్ అవుతోంది.
షారుఖ్ ఖాన్ నటింటిన రావన్ సినిమా ఘోరమైన డిజాస్టర్. కారణం వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేకపోవడమే.
ఇక అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు కూడా వీఎఫ్ఎక్స్ పనితీరు నాణ్యతా ప్రమాణాలమేరకు లేకపోవడంతో విఫలమైంది.
హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కించిన మొహెంజెదారో సినిమా 2016లో విడుదలైంది. వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేక సినిమా డిజాస్టర్ అయింది.
ఇక వరుణ్ ధావన్ నటించిన కలంక్ సినిమా పరిస్థితి కూడా అంతే. పీరియడ్ డ్రామా తెరకెక్కించడంలో చాలా లోపాలున్నాయని, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పని సరిగ్గా లేదని అంటున్నారు.