Aditi Rao Hydari: చురుకైన చూపులతో.. మనస్సులను దోచేస్తున్న అదితిరావు హైదరీ

Wed, 31 Jan 2024-9:14 pm,

Aditi Rao Hydari Instagram Pics:

ప్రజాపతి అనే మలయాళం సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ అదితి రావు హైదరి.

ఆతర్వాత అక్కడి నుంచి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ సిరినగరం అనే సినిమాలో నటించింది. బాలీవుడ్లో సైతం కొన్ని సినిమాలలో నటించింది ఈ హీరోయిన్.

బాలీవుడ్లో అదితి నటించిన ఢిల్లీ 6 మంచి విజయాన్ని అందుకోవడంతో హిందీలో వరుస అవకాశాలను సొంతం చేసుకుంది.

కాగా సమ్మోహనం అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది ఈ నటి‌. ఆ తర్వాత నుంచి తెలుగులో కూడా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ వచ్చింది.

అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. సినిమాలలోనే కాదు ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. తాజాగా అధితి రావు షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. పసుపు రంగు దృష్టిలో ఎంతో పద్ధతిగా కనిపిస్తూ అందరిని ఫిదా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link