Aditi Rao Hydari-Siddharth: సిద్ధార్థ్ వెరైటీ లవ్ ప్రపోజల్.. మా పెళ్లి అక్కడే అంటున్న అదితి..!
ప్రముఖ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మొదటిసారి ప్రముఖ హీరో సిద్ధార్థ్, ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి మహాసముద్రం సినిమా కోసం పనిచేశారు.. ఈ సినిమా తర్వాత పలు ఫంక్షన్లలో పార్టీలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఈ జంట ఆ కథనాలలో ఎలాంటి నిజం లేదని, తాము కేవలం స్నేహితులు మాత్రమే అంటూ పలు సందర్భాలలో క్లారిటీ ఇచ్చారు.
దీనికి తోడు ఒక హోటల్లో సిద్ధార్థ్, అదితి కనిపించడంతో మీడియా ఫోటోలు తీసే ప్రయత్నం చేయగా సిద్ధార్థ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో నిజంగానే వీరిద్దరూ ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు ఏ ఫంక్షన్ లో అయినా సరే ఈ జంట కనిపించింది. పైగా శర్వానంద్ పెళ్లి వేడుకల్లో కూడా సందడి చేసింది . దీంతో అందరూ వీరిద్దరూ వివాహం చేసుకున్నారంటూ ఫిక్స్ అయిపోయారు.
దీనికి తోడు గత నాలుగు నెలల క్రితం సిద్దార్థ్ ,అదితి రావు హైదరి వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నారని, ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, అతి తక్కువ మంది బంధువులు విచ్చేసారని వార్తలు వినిపించాయి కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అదితి రావు హైదరి, సిద్దార్థ్ తో తన ప్రేమ విషయాన్ని ఎప్పుడు చెప్పింది.? ఎలా చెప్పింది? అసలు ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు..? అసలు వీరి పెళ్లి ఎక్కడ జరగబోతోంది..? అనే విషయాలు వెల్లడించింది . ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అదితి రావు హైదరి మాట్లాడుతూ.. ఒకరోజు నేను సిద్దార్థ్ ను మా అమ్మమ్మ నిర్మించిన స్కూల్ కి తీసుకెళ్ళాను. అయితే అక్కడ ఊహించకుండా సిద్ధార్థ్ నా ముందు మోకాలి పై నిల్చున్నాడు.. వెంటనే నేను మీరు ఇప్పుడు ఏం పోగొట్టుకున్నారు..? ఎవరి షూ లేస్ తెరిచి ఉన్నాయి.. అంటూ అడిగాను. దాంతో వెంటనే ఆపు అంటూ తన ప్రపోజల్ ను నా ముందు ఉంచాడు సిద్ధార్థ్. ఇక అతడి ప్రపోజల్ ను నేను ఒప్పుకున్నాను అంటూ తెలిపింది అదితి రావు హైదరి. ఇకపోతే తమ పెళ్లి ఎక్కడ జరగబోతుంది అనే విషయాన్ని కూడా ఆమె చెబుతూ.. తెలంగాణలోని వనపర్తి లో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం శ్రీరంగాపురం రంగనాథ స్వామి దేవాలయంలో మా పెళ్లి జరగబోతోంది అని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.