Sharada Peetham: భూమి రద్దు తర్వాత వైఎస్ జగన్ సంచలనం.. శారదా పీఠం సందర్శన
సంచలన పర్యటన: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శారదా పీఠాన్ని సందర్శించడం సంచలనంగా మారింది.
శారదా పీఠం: విజయవాడ గాంధీనగర్ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఉన్న శ్రీ శృంగేరీ శారదా పీఠాన్ని వైఎస్ జగన్ సందర్శించారు.
ప్రత్యేక పూజలు: జగద్గురువు శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ వైఎస్ జగన్ కలిసి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా పీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భూముల రద్దు: శారదా పీఠం సందర్శన రాజకీయంగా కలకలం రేపింది. చంద్రబాబు ప్రభుత్వం శారదా పీఠం భూములు కేటాయించిన తర్వాత జగన్ శారదా పీఠం సందర్శించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మాజీ సీఎంగా: ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ విశాఖపట్టణంలో శారదా పీఠానికి భూములు కేటాయించారు.
భారీగా నాయకులు: ఈ పర్యటనలో వైఎస్ జగన్ వెంట ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్, నాయకులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్ తదితరులు ఉన్నారు.