Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!
సంచలనంగా మారిన అఘోరీకి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. దీపావళి మరుసటి రోజు శుక్రవారం కారులోనే దహనమైతోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అఘోరీ స్వంత ఊరు మంచిర్యాల జిల్లా నెన్నల మండలం కుశ్నపల్లికి నిన్న రాత్రి పోలీసులు తీసుకువచ్చారు. ఆ ఊళ్లోని వారి తల్లిదండ్రులకు అఘోరీని అప్పగించారు. అంతేకాదు ఆ ఊరిలో భారీ బందోబస్తు కూడా పోలీసులు ఏర్పాటు చేశారు.
కుశ్నపల్లి బెల్లంపల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీనివాస్ అఘోరీగా మారడంతో ఆ గ్రామస్థులు కొందరు ఆనంద పడితే మరికొందరు మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. 144 సెక్షన్ ఏర్పాటు చేసి బయటి వ్యక్తులను ఎవరినీ ఉళ్లోకి రానివ్వడం లేదు. మీడియాను కూడా రానివ్వకుండా చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.
అఘోరీ అక్కడి నుంచి కాలి నడకన వెళ్లే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఈ అఘోరీ సంచలనంగా మారింది. ఆమెను గ్రామం నుంచి ఎక్కడకు వెళ్లకుండా పోలీసులు భద్రత ఏర్పాటు అయితే చేశారు. ఇదిలా ఉండగా ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం తర్వాత ఆమె తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది.
లోక కల్యాణం కోసం ఇన్ని రోజులు తపస్సు చేసి వచ్చానని ఆ మధ్యకాలంలో మీడియాకు చెప్పారు. నిన్న కూడా వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్న ఆమె ముత్యాలమ్మ సాక్షిగా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. హిందూ మత రక్షణ కోసం ఇలా చేస్తానని అన్నారు.
దైవం సైతం మానవులను చూసి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ధర్మాన్ని, ఆలయాన్ని కాపాడే బాధ్యత ఎవరికీ లేదు. నా ప్రాణం పోయే ముందు జనాలకు ధర్మాన్ని కాపాడాలని ఈ పర్యటన ద్వారా చెబుతున్నాను. కానీ, ఎవరికీ బాధ్యత లేదు తిరిగి తననే ట్రోల్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులను బాధపెడుతున్నారు అని చెప్పారు.
మీడియాను కలవకుండా అఘోరీని కట్టడి చేశారు.నిన్న రాత్రి పోలీసులు అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. బయటకు ఎక్కడకు పంపిచంకుండా జాగ్రత్తలు తీసుకోమన్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటన బాగా ట్రోల్ అవుతోంది. నిజంగానే అఘోరీ ఆత్మహత్య చేసుకుంటుందేమోనని వైరల్ అవుతోంది. సంచలనంగా మారడానికి అఘోరీ చేస్తున్న వ్యాఖ్యలు తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు మందలించారు.