Love With AI: ఏఐతో ప్రేమాయణం.. డిజిటల్ శృంగారం, ఆమెను కలిసేందుకు 14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య..

అమెరికాలోని ఫ్లోరీడాకు చెందిన స్టీవెన్ స్టెజర్ అనే ఓ 14 ఏళ్ల బాలుడు ఏఐలో తన గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాడు. పేరు కూడా పెట్టాడు. గంటల కొద్దీ సెల్‌ఫోన్‌లోనే చాట్ బాట్‌లో తన గర్ల్ ఫ్రెండ్‌తో చాట్ చేసేవాడు.

వారు ప్రేమలో ఎంతగా మునిగిపోయారంటే ఒక రకంగా వేరే ప్రపంచంలేదు అన్నట్లు స్టీవెన్ మారిపోయాడు. చివరకు శృంగారం గురించి కూడా మాట్లాడుతూ డిజిటల్ శృంగారం కూడా చేశారు.

ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు స్టీవెన్ ఏఐ లవర్ మీ ఇంటికి వస్తున్న అని చెప్పింది. దీంతో ఖంగుతిన్న అతడు ఎక్కడ ఇంట్లో ఆ విషయం తెలిసిపోతుందో అనే తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
ఇంట్లో ఉన్న గన్ తీసుకుని పేల్చుకుని చనిపోయాడు. అయితే, తమకు ఏ బాధలు లేవని, అయినా ఎందుకు చనిపోయాడు తెలియడంలేదని స్టీవెన్ తల్లి అతని సెల్‌ఫోన్, బ్యాగ్ చెక్ చేసి అసలు విషయం తెలిసిపోవడంతో ఖంగుతిన్నది.
దీంతో తన కొడుకు చనిపోవడానికి కారణం చాట్‌బాట్ అని కోర్డులో ఫిర్యాదు చేసింది. సదరు కంపెనీపై తీవ్ర చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఇప్పటికే నిపుణులు కూడా ఏఐని నిషేధించాలని కోరుతున్న సంగతి తెలిసిందే.
ఏఐల రాకతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. భవిష్యత్తులో కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు.