Airtel FD: ఎయిర్‌టెల్ అదిరిపోయే సరికొత్త ఫిక్సెడ్ డిపాజిట్.. ఏకంగా 9.1 శాతం వడ్డీ పొందే స్కీమ్
Airtel Fixed Deposit Scheme: సాధారణంగా ఏ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు 7 శాతం అంతకు మించి సీనియర్ సిటిజెన్లకు అందిస్తున్నట్లు తెలుసు. కొన్ని ప్రభుత్వ రంగ పథకాల్లో 8 శాతం లోపే అందిస్తున్నాయి. కానీ, భారతీ ఎయిర్ టెల్ ఇప్పటి వరకు ఎవరూ అందించని ఫిక్సెడ్ డిపాజిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 9.1 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ప్రముఖ భారతీ ఎయిర్ టెల్ స్మాల్ ఫైనాన్స్, ఎన్‌బీఎఫీసుల భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ను ముందుకు తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అత్యధికంగా రూ.9.1 శాతం వడ్డీ పొందవచ్చు. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఈ సదుపాయం పొందవచ్చు అని ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఏ బ్యాంకుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా ఎఫ్‌డీ బుక్ చేయవచ్చు. మీరు డిపాజిట్ డబ్బులు మీ అవసరాల నిమిత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. లాక్ ఇన్ భయం లేదు.
ఎయిర్ టెల్ ఈ ఫిక్సెడ్ డిపాజిట్ ను ఉత్కర్ష్‌స్మాల్ ఫైనాన్స్, శివాలిక్ బ్యాంక్, సూర్యోదయ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో ఎయిర్‌టెల్ జతకట్టి ఈ అధిక వడ్డీరేటు అందించే డిజిటల్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభిస్తోంది.
భారతీ ఎయిర్ టెల్ త్వరలో వ్యాపార రుణాలు, సెక్యూర్డ్ రుణాలను కూడా అందించనుంది. ఇప్పటికే ఎయిర్ టెల్ ఫైనాన్స్, ఫ్లెక్సీ పర్సనల్ లోన్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా బ్యాంకుల్లో మనం ఫిక్సెడ్ డిపాజిట్ చేసేది అధిక డబ్బులు పొందవచ్చని. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా అత్యధిక వడ్డీ పొందే అవకాశం వచ్చింది.