Aishwarya Lekshmi Pics: బ్లాక్ డ్రెస్‌లో ఐశ్వర్య లక్ష్మి.. కోయిలలా మెరిసిపోతున్న కేరళ కుట్టి!

Sat, 26 Nov 2022-8:54 pm,

ఐశ్వర్య లక్ష్మి తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిశారు. విష్ణు విశాల్ నటించిన మట్టి కుస్తి సినిమా ప్రమోషన్‌ల భాగంగా కేరళ కుట్టి హైదరాబాద్‌లో సందడి చేశారు.   

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే ఐశ్వర్య లక్ష్మి ఎప్పటికప్పుడు తన ఫోటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

ఐశ్వర్య లక్ష్మికి తెలుగులో కూడా ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నపాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ చేస్తున్నారు. మహేష్ బాబుకి ఆపోజిట్ క్యారెక్టర్‌లో ఐశ్వర్య నటించనున్నారట.   

మలయాళం, తమిళ సినిమాలతో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మి బిజీగా ఉన్నారు. హీరోయిన్, ప్రత్యేక పాత్రలు, విలన్ రోల్స్.. ఇలా వైవిధ్యంగా సాగుతోంది ఆమె కెరీర్. ఇటీవల వచ్చిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో మంచి పాత్ర పోషించారు.  

ఐశ్వర్య లక్ష్మి  2014లో మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. 2017లో మలయాళంలో విడుదలైన 'జందుకలుండే నత్తిల్ ఒరిదవేల్' సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు .   

1991 సెప్టెంబరు 6న ఐశ్వర్య లక్ష్మి కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. ఎర్నాకులంలోని శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్‌లో విద్యాబ్యాసం చేశారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link