Aishwarya Rai Bachchan Cannes 2022: కేన్స్‌లో ఐశ్వర్య రాయ్.. క్వీన్ ఆఫ్ కేన్స్ పైనే అందరి కళ్లు!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ మెరిసిపోయారు. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య హోయలు పోయారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్ మెరిసిపోయారు. బ్లాక్ కలర్ వాలెంటినో గౌన్‌లో 75వ కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య హోయలు పోయారు.
ఐశ్వర్య రాయ్ బచ్చన్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022కు భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చారు.
స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి పెళ్లిచేసుకున్నారు. ఆపై ఆరాధ్యకు జన్మనిచ్చారు. పెళ్లి తర్వాత ఐష్ సినిమాలు తగ్గించారు.
దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో, రావణ్, ప్రియురాలు పిలిచింది, సర్కార్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు ఐశ్వర్య రాయ్ ఖాతాలో ఉన్నాయి.
'జీన్స్' సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన ఐశ్వర్య రాయ్.. అనతి కాలంలోనే పెద్ద స్టార్ అయ్యారు. 'ఔర్ ప్యార్ హో గయా'తో హిందీ ఆరంగేట్రం చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ 'ఐశ్వర్య రాయ్ బచ్చన్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ సుందరి అవార్డు గెలుచుకుని అప్పట్లో పెద్ద సంచలనం సృటించారు.