Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ విడాకులు? పర్సనల్‌గా రాసుకున్న డైరీ పేజీ లీక్

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి విశ్వసుందరిగా ప్రపంచ ఖ్యాతి పొందిన తార ఐశ్వర్య రాయ్. మోడల్ గా రాణిస్తూనే సినిమాల్లోకి వచ్చి భారత సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన నటి ఐశ్వర్య.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్య రాయ్ కాపురంలో కొన్నాళ్లుగా కలహాలు ఉన్నాయని సినీ పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది.

వారిద్దరూ విడిగా ఉంటున్నారని.. విడాకులు తీసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి.
అయితే తాజాగా ఆమె రాసుకున్న డైరీ పేజీ ఒకటి సామాజిక మాధ్యమాల్లో లీకయ్యింది.
ఆ పేజీలో తన భర్తతో ఎలా ఉండాలనే విషయాలను ఐశ్వర్య రాసుకుంది.
'చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకెళ్లే పార్ట్‌నర్ కావాలి', 'నిజాయతీ, మర్యాద వంటి సద్గుణాలు కలిగిన వ్యక్తి కావాలి' అని డైరీలో ఐశ్వర్య రాసింది.
తన కలల రాకుమారుడికి కావాల్సిన లక్షణాలు అభిషేక్ బచ్చన్‌లో లేనట్టు ఉన్నాయి. అందుకే విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
'మై లవ్. ఆల్వేస్ ఐశ్వర్య రాయ్' అని సంతకం చేసిన ఆ పేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కాగా ఐశ్వర్య ఆ డైరీ ఏ రోజు, ఏ సంవత్సరం రాశారనేది తెలియడం లేదు. ఈ డైరీ పేజీ లీకవడంతో ఐశ్వర్యకు కావాల్సిన లక్షణాలు అభిషేక్‌లో లేవని.. త్వరలో విడాకులు తీసుకుంటారని చర్చ జరుగుతోంది. మరి ఏ జరుగుతుందనేది కాలమే నిర్ణయించాలి.