Healthy Liver: మందుకు బానిసై లివర్ పాడయిందా, ఈ 5 ఫుడ్స్ తింటే మళ్లీ లివర్ సెట్ అయిపోతుంది
ఓట్ మీల్
ఓట్ మీల్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు లివర్ ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుంది.
లివర్ సంరక్షణకు 5 కీలక పదార్ధాలు
శరీరంలో అన్ని రకాల ఫ్యాట్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లను కంట్రోల్ చేయడం లివర్ ద్వారానే అవుతుంది. కొన్ని హెల్తీ ఫుడ్స్ తింటే లివర్ పటిష్టం చేయవచ్చు. లివర్ ఆరోగ్యంగా లేకుంటే మెటబోలిక్ డిజార్డర్ తలెత్తవచ్చు. ఇందులో టైప్ 2 డయాబెటిస్ ముఖ్యమైంది.
ఆకుకూరలు
రోజూ నియమిత మోతాదులో ఆకు కూరలు తింటే శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. అటు లివర్ కు కూడా చాలా లాభాలు కలుగుతాయి. దీనికోసం పాలకూర, తోటకూర, అరటి, కాలిఫ్లవర్, బ్రోకలీ తీసుకోవాలి
ఆలివ్ ఆయిల్
ఇండియాలో ఆయిలీ ఫుడ్స్, శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఫుడ్స్, జంగ్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటున్నారు. దాంతో లివర్ పాడవుతోంది. ఈ క్రమంలో కుకింగ్ ఆయిల్ మార్చాల్సి ఉంటుంది. సాధారణ కుకింగ్ ఆయిల్ స్థానంలో ఆలివ్ ఆయిల్ లేదా జైతూన్ ఆయిల్ వాడటం మంచిది.
ద్రాక్ష
రోజూ క్రమం తప్పకుండా ద్రాక్ష తినడం ప్రారంభిస్తే లివర్ తప్పకుండా ఆరోగ్యవంతంగా మారుతుంది. ఆ ప్రబావం మీకు వివిధ రూపాల్లో కన్పిస్తుంది.
గ్రీన్ టీ
ఒక రోజులో 2 సార్లు గ్రీన్ టీ తాగితే లివర్ కేన్సర్ నుంచి రక్షించుకోవచ్చంటారు. అయితే గ్రీన్ టీ అవసరానికి మించి తాగకూడదు.