HDFC Bank: గూగుల్ పే, ఫోన్ పే వాడే వారికి అలర్ట్...ఈ రెండు రోజులు ఆ బ్యాంకు పనిచేయదు.. క్యాష్ దగ్గర పెట్టుకోండి
HDFC Bank: ప్రస్తుత కాలంలో యూపీఐ సేవలు లేకుండా మనం ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక రూపాయి ఖర్చు పెట్టాలి అన్న కూడా స్కానర్ తోని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అందుకు తగ్గట్టుగానే బయట కూడా ఎక్కడా చిల్లర లభించడం లేదు. దుకాణదారులు కూడా స్కానర్ ద్వారా డబ్బులు వేయమని అడుగుతున్నారు.
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఆ రేంజ్ లో జనాలు అలవాటు పడిపోయారు.. ఒక గంట పాటు కూడా యూపీఐ పని చేయకపోతే అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా భారత దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకు లో ఒకటైన HDFC బ్యాంకు తమ కస్టమర్లకు ఒక అలర్ట్ జారీ చేసింది.
ఇందులో భాగంగా రెండు రోజులపాటు యూపీఐ సేవలు నిలిపివేస్తామని పేర్కొంది. అయితే రెండు రోజుల్లో కూడా నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఈ సేవలు పనిచేయవు. ఇందుకు కారణం చెబుతూ కొన్ని మెయింటైనెన్స్ పనులు ఉండడం వల్ల ఇలా చేయాల్సి వస్తుందని, బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
మెయిన్ టెనెన్స్ పనుల కారణంగా నవంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు రెండు గంటల పాటు, నవంబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు UPI తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది.
ఇది HDFC బ్యాంక్ కరెంట్ ఖాతా, సేవింగ్స్ ఖాతా, రూపే క్రెడిట్ కార్డ్ మొదలైన UPI లావాదేవీలు పని చేయవు. HDFC మొబైల్‌బ్యాంకింగ్ యాప్, GPay, Paytm, Phonepe, Whatsapp Pay మొదలైన ఏ యాప్‌లోనైనా UPI లావాదేవీ చేయలేరు.
ఇదిలా ఉంటే బ్యాంకు ఏటీఎంలు మాత్రం తెరిచి ఉంటాయి వాటి ద్వారా నగదు తీర్చుకొని మీరు పని చేసుకోవచ్చు. . కాగా బ్యాంకులు తరచూ ఇలా మెయింటైనెన్స్ పనులు చేయడం ద్వారా పలుమార్లు అంతరాయం వస్తుండడం సహజం. బ్యాంకు నిర్వహణలో భాగంగా ఇవన్నీ తప్పనిసరి. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బ్యాంకులో ఇలాంటి చర్యలు చేపడుతూ ఉంటాయి.
ఇదిలా ఉంటే యూపీఐ సేవలు వాడుకునే వారికి ఫోన్ పే, గూగుల్ పే లాంటి సంస్థలతో పాటు ఇతర బ్యాంకింగ్ సంస్థలు సైతం యూపీఐ సేవలను ప్రారంభించాయి. అయితే తాజాగా యూపీఐ లైట్ టాప్ అప్ లిమిట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఈ సేవలు నిర్వహించుకునే వారికి మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు, యూపీఐ సేవలు నిర్వహించే NPCI పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.