Pan Card: పాన్ కార్డు వినియోగదారులకు కీలక అప్ డేట్ ..ఇలా చేయకపోతే 10వేలు ఫైన్ పక్కా

Sun, 08 Dec 2024-5:15 pm,
Pan Card:

Pan Card: నేటికాలంలో పాన్ కార్డ్ అనేది కీలకం మారింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఐటీ డిపార్ట్ మెంట్ ఇస్తున్న పాన్ కార్డ్స్ పొందుతున్నారు. బ్యాంకు సేవలు మొదలుకుని షాపింగ్, ప్రభుత్వ స్కీముల కోసం పాన్ కార్డ్స్ ను ఉపయోగిస్తున్నారు.

Online application through PAN card

పాన్ కార్డ్ ద్వారా ఆన్ లైన్ అప్లికేషన్ కోసం భారత ప్రభుత్వం రెండు ప్రధాన ఏజెన్సీలకు అధికారం ఇచ్చింది. అవి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, యూటీఐ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్. వీటి అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి కొత్త పాన్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు. 

Misuse of PAN cards

అయితే ఇదే అదునుగా కొంతమంది పాన్ కార్డులను దుర్వినియోగం చేయడమే కాకుండా. మోసపూరిత కార్యకలాపాల్లో తప్పుడు వివరాలను సమర్పించి ఒకటికి మించిన పాన్ కార్డులను పొందుతున్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఇలాంటి సందర్భాల్లో ఫైన్ తో పాటు జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంది. 

రూల్స్ ఉల్లంఘించినందుకు గాను ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 277 బీ ప్రకారం రూ. 10వేలు జరిమానా వసూలు చేస్తారు. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడుతుంది.

మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉన్నట్లయితే అదనపు పాన్ కార్డు వెంటనే సరెండర్ చేయడం మంచిది. సంబంధిత అధికారులకు ఈ విషయం తెలియజేసి రద్దు చేయించుకోవడం బెటర్. లేదంటే సమస్యల్లో పడటం ఖాయం.   

ఇక పాన్ కార్డులో కొన్ని మార్పులు  తీసుకువచ్చేందుకు ప్రభుత్వం పాన్ 2.0 స్కీమును అమలు చేస్తోంది. ఇక నుంచి ప్రతి పాన్ కార్డుకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి. పాన్ 2.0 సిస్టమ్ కింద పాన్ కార్డులోని అడ్రస్ ను ఫ్రీగా అప్ డేట్ చేసుకోవచ్చు.

అడ్రస్ అప్ డేట్ అయిన తర్వాత ఒక కొత్త ఈ పాన్ రిజిసర్డ్ ఈ మెయిల్ కు వస్తుంది. ఈ సర్వీస్ కు రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఫిజికల్ కార్డు కావాలంటే కేవలం రూ. 50 చెల్లించి పాన్ కార్డును పొందాల్సి ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link