Photo Story: ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్

Sun, 23 Aug 2020-11:49 am,

టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బ్రిటన్ బాక్సర్ డిలియన్ వైట్‌ (Dillian Whyte)కు ఓటమి ఎదురైంది. వరల్డ్ బాక్సింగ్ కౌన్సిల్ నిర్వహించిన బౌట్‌లో రష్యా బాక్సర్ అలెగ్జాండర్ పోవెట్కిన్ (Alexander Povetkin) ఏకంగా బ్రిటన్ బాక్సర్ డిలియన్ వైట్‌పై నాకౌట్ (Alexander Povetkin knocks out Dillian Whyte) విజయాన్ని సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు. సినిమా సీన్‌ను తలపిస్తూ విజయాన్ని అందుకున్నాడు.

తొలి నాలుగు రౌండ్లు ప్రత్యర్థి వైట్ చేతిలో దారుణమైన పంచ్ దెబ్బలు రుచి చూశాడు అలెగ్జాండర్. ఓ దశలో నాలుగో రౌండ్‌లో రెండు పర్యాయాలు నాకౌట్ ఓటమి దరిదాపుల్లోకి వెళ్లి దాదాపు ఓటమిని రుచి చూశాడు.  (All Images Credit: Twitter)

కానీ సినిమాల్లో హీరోలు ప్రత్యర్థిని ఒక్క పంచ్‌తో మట్టికరిపించినట్లుగా అద్భుతమైన లెఫ్ట్ అప్పర్ కట్‌ పంచ్‌తో రష్యా బాక్సార్ అలెగ్జాండర్ తన ప్రత్యర్థి డిలియన్ వైట్‌ను నాకౌట్ చేశాడు. బౌట్ చూసినవాళ్లకు సీన్ అర్థం కావడానికి ఎంతో సమయం పట్టింది.     (All Images Credit: Twitter)

బౌట్ చూసివాళ్లే అంత ఆశ్చర్యపోయారంటే.. ఓటమిపాలైన బ్రిటన్ బాక్సార్ వైట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. డిసెంబర్‌లో మరోసారి రీమ్యాచ్ ఆడదామని తన ప్రత్యర్ధి అలెగ్జాండర్‌కు సవాల్ (Dillian Whyte Requests Rematch with Alexander Povetkin) విసిరాడు.   (All Images Credit: Twitter)

నాలుగు రౌండ్లు నేను ఆధిపత్యం చెలాయించాను. కానీ ఇది హెవీ వెయిట్ బాక్సింగ్. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అయితే మ్యాచ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది నేనేనని కచ్చితంగా చెప్పగలను. రీ మ్యాచ్‌లో నా సత్తాచాటుతానని ఓటమి అనంతరం బాక్సర్ డిలియన్ వైట్ అన్నాడు.  (All Images Credit: Twitter)

(All Images Credit: Twitter)

(All Images Credit: Twitter)

(All Images Credit: Twitter) ఈ ఫొటోలను ట్విట్టర్‌లోని పలు ఖాతాల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link