Alia Bhatt Pics : పెళ్లై ఏడాది అంటూ సందడి.. రేర్ పిక్స్ షేర్ చేసిన అలియా భట్

Fri, 14 Apr 2023-4:28 pm,

బాలీవుడ్‌ జంటల్లో అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లది ప్రత్యేకం. రణ్ బీర్ కపూర్ ఎంత మందితో ప్రేమలో ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఆయన రిలేషన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. చివరకు అలియాతో పెళ్లి వరకు వచ్చింది.

గత ఏడాది ఏప్రిల్‌ 14న అలియా, రణ్‌బీర్‌ల పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. మామూలుగా 2020లోనే పెళ్లి చేసుకునేవారట. కానీ కరోనా వచ్చిందని పెళ్లిని వాయిదా వేశారట.

ఇక రణ్‌ బీర్ అలియాలు పెళ్లి కంటే ముందే తొందరపడ్డట్టుగా కనిపిస్తోంది. పెళ్లి నాటికే అలియా గర్భంతో ఉన్నారని తరువాత అర్థమైంది. ఏప్రిల్‌లో పెళ్లి జరిగితే.. జూన్‌లో బిడ్డను కనేసింది అలియా.

తమ బిడ్డకు రాహా అనే పేరును పెట్టారు అలియా భట్ దంపతులు. రాహా అంటే.. భక్తిమార్గం, ముక్తిమార్గం, కిరీటీం, మనశ్శాంతిని కలిగించేది.. ఇలా ఎన్నో అర్థాలున్నాయి.

అలియా భట్‌ తాజాగా తమ దాంపత్యానికి ఏడాది అయిందంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో రణ్ బీర్ కపూర్ అలియా భట్‌ల మధ్య ఉన్న ప్రేమ అందరికీ అర్థమవుతోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link