Heroine: రూ.5 కోట్లతో పెట్టుబడితో 10 రెట్లు లాభం.. ఈ హీరోయిన్ తెలివితేటలు మామూలుగా లేవుగా..!
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన హీరోయిన్ ఆలియా భట్.. ఈ అమ్మడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక్కొక్క సినిమాతో తన స్టార్డం పెంచుకుంది. గడచిన కొన్నేళ్ల క్రితం ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని కూడా అందుకుంది.
ప్రస్తుతం ఒక్కో చిత్రానికి భారీ స్థాయిలోని రెమ్యూనరేషన్ అందుకుంటోంది. ఒక్కో సినిమాకి రూ.18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా నిలిచింది.
2020లో ఒక కంపెనీలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది ఆలియా భట్. అలా ఒక్క ఏడాదిలోనే 11% లాభాలను కూడా అందుకుంది. ప్రముఖ కాస్మోటిక్ బ్రాండ్లలలో 4.95 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఈ ముద్దుగుమ్మ సుమారుగా రూ.54 కోట్ల రూపాయల లాభాన్ని సైతం అందుకుంది.
ముఖ్యంగా ఆలియా భట్ ఎక్కువగా దుస్తులు, కాస్మటిక్ వంటి బ్రాండ్లలోనే పెట్టుబడులు పెడుతోంది. వీటితో పాటుగా ఫ్యాషన్ కంపెనీలో కూడా పెట్టుబడులు పెట్టిన ఆలియా భట్. ఇవే కాకుండా పలు రకాల ఫిలిం ప్రొడక్షన్ హౌస్ తోపాటు సూపర్ బాటమ్స్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన ఆలియా భట్ ఇందులో చేసిన సీత పాత్ర ఇప్పటికీ అభిమానులను అలరిస్తోంది.
2022లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక కూతురు కూడా జన్మించిన సంగతి తెలిసిందే.