Alisha: సినిమాలు, మోడలింగ్, స్పోర్ట్స్ లో దూసుకుపోతున్న హైదరాబాదీ అమ్మాయి అలీషా..
ఇప్పటికే పలు ప్రకటనలు, సినిమాల్లోని క్యారెక్టర్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తూ దూసుకుపోతుంది హైదరాబాదీ అమ్మాయి అలీషా. మోడలింగ్ రంగం మీద ఇంట్రెస్టింగ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
సినిమాల్లోనే కాకుండా బాస్కెట్ బాల్, చెస్ వంటి 'స్పోర్ట్స్ లో అలీషా ముందుంది. ఎంతో ప్యాషన్‌తో, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామకు వరుసగా ఆఫర్లు పలకరిస్తున్నాయి.
సినిమాల్లో ఛాన్సెస్ కోసం దానిపై ప్యాషన్ ఉన్న యువతకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో అలీషా ప్రయాణిస్తోంది.
ఆర్ధిక పరిస్థితులు బాగాలేకపోయినా.. సొంత కాళ్లపై నిలబడి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది అలీషా. 5.5 అడుగుల ఎత్తు ఉన్న ఈమె తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండటంతో ఈమెకు వరుస ఛాన్సులు వస్తున్నాయి.
ఇప్పటికే తెలుగులో ఓం భీం బుష్, మాతృ, ఫైటర్ రాజా వంటి చిత్రాల్లో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. బ్రైడల్ షూట్, గ్లోబల్ ఎడ్యుటెక్ వంటి వాటికి యాడ్స్,పొలిటిక్ పార్టీ ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
తెలుగులో ఎద లోయల్లో ఇంద్రధనస్సు వంటి సీరియల్‌తో క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.