Kisan Credit Card Loan Scheme: రైతులందరికీ గుడ్ న్యూస్.. బ్యాంక్ నుంచి ఫ్రీగానే రూ.1.6 లక్షల లోన్ పొందండి!
ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకుని డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని వినియోగించి ప్రతి రైతు ఎక్కడున్న సులభంగా రుణాలు పొందే అవకాశాన్ని అందిస్తోంది. అయితే మీరు కూడా సులభంగా ఈ కార్డులతో రుణాన్ని పొందాలనుకుంటున్నారా?
ఈ రుణాన్ని పొందడానికి ముందుగా www.unionbankofindia.co.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత digital-kcc అనే ఆప్షన్ చూస్ చేసుకుని నేరుగా ఆ పేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఈ ప్రత్యేకమైన ఆప్షన్‌ను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని వినియోగించి ప్రతి రైతు దాదాపు రూ.1.6 లక్షల వరకు ఇంట్లోనే ఉండి సులభంగా రుణం పొందవచ్చు.
ఇప్పటికే క్రెడిట్ కార్డ్ లేని వారు సులభంగా బ్యాంక్ వీవైఓఎం ప్రత్యేకమైన యాప్‌ను వినియోగించి సులభంగా డిజిటల్ కిసాన్ కార్డ్‌ను పొందవచ్చు. అయితే దీనిని అప్లై చేసేకునేవారు ఎలాంటి డాక్యుమెంట్లు బ్యాంక్ లేదా ఇతర కార్యాలయాల్లో ఇవ్వన్నక్కర్లేదు..అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే ఫామ్ ల్యాండ్ వెరిఫికేషన్ కూడా జరిగిపోతుంది.
అలాగే ఈ క్రెడిట్ కార్డ్‌ను పొందడానికి శాటిలైట్ ఇమేజరీ, మ్యాపింగ్‌ను జియో ట్యాపింగ్‌తో వెరిఫై కూడా చేస్తారు. ఇవన్నీ జరిగకా.. వెంటనే లోన్‌కి సంబంధించిన నిర్ణయాలు కూడా వెలుబడే ఛాన్స్‌లు ఉన్నాయి. దీనిని క్రాపింగ్ ఇతర డేటా ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకునే ఛాన్స్‌లు ఉన్నాయి.
ఆ తర్వాత బ్యాంక్ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత.. యాప్ ప్రాసెస్ మేరకు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిసాన్ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. ఇలా చేసిన తర్వాత బ్యాంక్‌కి సంబంధించి వెబ్‌సైట్‌లోకి వెళ్తే.. డిజిటల్ కేసీసీ అప్లికేషన్ ఆప్షన్ లభిస్తుంది.
మీకు ఈ డిజిటల్ కేసీసీ అప్లికేషన్ ఆప్షన్ లభించిన తర్వాత దానిపై క్లిక్ చేయండి. ఇందులో సెల్ఫ్ సర్వీస్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అన్ని డిటేల్స్ ఫిల్ చేసి..లోన్ అప్లై చేసుకుంటే నేరుగా ఎలాంటి ప్రాసెస్ లేకుండా రూ.1,6 లక్షల వరకు లోన్ లభిస్తుంది.