Allari Naresh old Titles Repeat: `ఆ ఒక్కటి అడక్కు` సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..

ఆ ఒక్కటి అడక్కు.. (Aa Okkati Adakku) అల్లరి నరేష్ తండ్రి దివంగత ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటి అడక్కు' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు ఇదే క్లాసిక్ టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నాడు అల్లరి నరేష్. మరి పాత సూపర్ హిట్ సినిమాలాగా ఈ సినిమాతో అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

అహనా పెళ్లంట.. (Ahana Pellanta) గతంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ఒకప్పటి క్లాసిక్ టైటిల్ 'అహ నా పెళ్లంట'. ఇదే ఓల్డ్ టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు.

బంగారు బుల్లోడు (Bangaru Bullodu)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'బంగారు బుల్లోడు'. ఈ టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు.
యముడికి మొగుడు (Yamudiki Mogudu)
బాలకృష్ణ టైటిల్‌తోనే కాదు.. చిరంజీవి పాత సూపర్ హిట్ టైటిల్ 'యుముడికి మొగుడు' టైటిల్‌తో అల్లరి నరేష్ సినిమా చేసి ఫ్లాప్ అందుకున్నాడు.
సుందరకాండ.. (Sundarakanda) వెంకటేష్ బ్లాక్ బస్టర్ సుందరకాండ టైటిల్‌తో బాపు దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది.
జేమ్స్ బాండ్.. (James Bond) అటు సూపర్ స్టార్ కృష్ణ మీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'జేమ్స్ బాండ్ 777'. ఈ టైటిల్‌లో 777 ఒదిలిపెట్టి కేవలం 'జేమ్స్ బాండ్' టైటిల్‌తో అల్లరోడు చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేకపోయింది.
గమ్యం (Gamyam) పెళ్లి సందడి తర్వాత శ్రీకాంత్, రవళి జంటగా తెరకెక్కిన మూవీ 'గమ్యం'. ఇదే టైటిల్‌తో క్రిష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ చేసిన 'గమ్యం' మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మహర్షి (Maharshi)
ఓల్డ్ క్లాసిక్ టైటిల్ మహర్షి టైటిల్‌తో మహేష్ బాబుతో అల్లరి నరేష్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది.
ఆకాశ రామన్న అప్పట్లో 'ఆకాశ రామన్న' పేరుతో కాంతారావు హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్‌తో అల్లరి నరేష్ ఓ సినిమా చేసాడన్న సంగతి కూడా ప్రేక్షకులు తెలియదు.