Allu Sirish: ఎట్టకేలకు ఓ ఇంటి వాడు కాబోతున్న అల్లు శిరీష్..!

Sun, 15 Dec 2024-7:56 pm,
Allu Arjun brother

అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు శిరీష్. ఇకపోతే అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.. పెద్ద కొడుకు బిజినెస్ రంగంలో బిజీగా మారగా.. రెండవ కొడుకు అల్లు అర్జున్ మాత్రం పాన్ ఇండియా హీరో అయిపోయారు. అంతేకాదు ఇప్పుడు జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ అందుకున్నారని చెప్పవచ్చు. 

Allu Sirish marriage

ఇక చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం అడపా దడపా సినిమాలలో నటిస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆయనకు సక్సెస్ అనేది లభించలేదు. కనీసం ఒక్క హిట్ కూడా ఆయన ఖాతాలో లేదనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కనీసం పెళ్లి చేసుకొని వ్యక్తిగత కెరియర్ లోనైనా సెటిల్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. 

Allu Sirish wedding

ఇక అందులో భాగంగానే గతంలో అను ఇమ్మాన్యుయేల్ తో ప్రేమలో పడ్డారు. ఆమెను వివాహం చేసుకోబోతున్నారంటే వార్తలు వినిపించాయి. ఇందులో అల్లు అరవింద్ కూడా ఇన్వాల్వ్ అయినట్లు సమాచారం కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా చాలా కాలం తర్వాత అల్లు శిరీష్ తాను ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు అనే వార్తలు ప్రధమంగా వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే అల్లు శిరీష్ ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే సమయంలో తన క్లోజ్ ఫ్రెండ్ తో ప్రేమలో పడినట్లు సమాచారం. 

ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించి త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నట్లు సమాచారం.ఒక ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నారు. అయితే వీరి వివాహం ఎప్పుడు అనే విషయం ఇంకా తెలియలేదు. ఏది ఏమైనా త్వరలోనే మళ్లీ సినీ ఇండస్ట్రీలో ఒక పెళ్లి జరగబోతుందని చెప్పవచ్చు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link