Allu Arjun Speech at Pushpa 2 Event: కేసు వేసిన తగ్గేదేలే.. మరోసారి అభిమానులను ఆర్మీ అని పిలిచిన అల్లు అర్జున్..!
ఈ మధ్యనే అల్లు అర్జున్, ఇక ఆయన అభిమానులు.. తమను ఆర్మీ అని పిలుచుకుంటున్నారని.. అది మన దేశ ఆర్మీకి మాత్రమే సొంతమని.. ఇలా ఎవరు పడితే వారు ఆ ఆర్మీ అన్న పదం ఉపయోగించకూడదని.. కొంతమంది పోలీస్ స్టేషన్లో.. అల్లు అర్జున్ పై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేస్ ప్రస్తుతం నడుస్తుండగా.. మరోసారి అల్లు అర్జున్ అదే పదం వారి అందరిని ఆశ్చర్యపరిచారు. ఏదేమైనా తగ్గేదేలే అన్న అల్లు అర్జున్ తీరు ఆయన అభిమానులకు ముచ్చట కలిగించగా.. యాంటీ ఫ్యాన్స్ కి మాత్రం ఆశ్చర్యం కలిగించింది.
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భావోద్వేగంగా మాట్లాడారు. "అందరికీ నమస్కారం. పుష్ప 1 పూర్తయినా, పుష్ప 2 కథ వినలేదు. కానీ పుష్ప 2 తగ్గేదేలే.. అని నమ్మకం ఉంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మూడు సంవత్సరాల క్రితం పుష్ప 1 కోసం ఇదే విధంగా మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు మళ్లీ కలవడం సంతోషంగా ఉంది. నా అభిమానులు, నాకు నేర్పించిన నా ఆర్మీకి హృదయపూర్వక అభినందనలు," అని చెప్పుకొచ్చారు
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి, సీఈఓ చెర్రీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు కాకుండా ఇంకా ఏ నిర్మాతలు కూడా.. ఈ సినిమా తీయగలిగే వారు కాదు. మమ్మల్ని నమ్మి ఈ చిత్రంపై ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినందుకు వారికి థాంక్స్. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సీఈఓ చెర్రీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు,” అని తెలియజేశారు. అలాగే ఈ చిత్రానికి ఐదేళ్లు జీవితం అర్పించిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్టుకు ధన్యవాదాలు చెప్పారు. "డీఓపీ కూబా, ఫైట్ కొరియోగ్రాఫర్లు, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్ గార్లతో పాటు ఫహద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ వంటి.. అందరికీ నా ధన్యవాదాలు."
రష్మిక మంధన్న గురించి మాట్లాడుతూ, "ఇలాంటి ప్రొఫెషనల్ అమ్మాయితో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. పీలింగ్స్ సాంగ్ కోసం నిద్ర లేకుండా కష్టపడటం చూసి ఆశ్చర్యపోయాను. రష్మికకు ఈ సినిమా గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను,"అని అన్నారు. సుకుమార్ గురించి, "పుష్ప అనేది సుకుమార్ సినిమా. ఆయన కష్టం చూస్తే గర్వంగా ఉంటుంది. ఆయన లేకుండా ఈ సినిమా ఉండేది కాదు," అని అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పుష్ప 2 విడుదల గురించి మాట్లాడుతూ, "ఈ సినిమా 12,000 స్క్రీన్‌లలో, 80 పైగా దేశాల్లో, ఆరు భాషల్లో విడుదల కాబోతుంది. ఇది మా గొప్పతనం కాదు, మీ ఆదరణకు ప్రతిఫలం," అన్నారు. చివరగా, "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అనుకుంటివా, వైల్డ్ ఫైర్!" అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఇక ఈ స్పీచ్ లో అల్లు అర్జున్ ఆర్మీ అంటూ చెప్పిన మాటలు ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.