Allu Arjun: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన బన్నీ.. పోస్ట్ చేసి డిలీట్ చేశాడుగా.. భయపడ్డారా..?
ఈ ఏడాది ఏపీలో ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకపోవడం వల్లే అసలు గొడవ మొదలైంది. అల్లు అర్జున్ ఒకప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఈ స్థాయికి వచ్చాడు. చిరంజీవి నా దేవుడు అని ,మెగా అభిమానుల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు అల్లు అర్జున్.
అయితే ఇప్పుడు ప్లేట్ మార్చేశారు అని చెప్పవచ్చు. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చానని , తన తండ్రి తనకు సర్వస్వం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు తన అభిమానులను అల్లు ఆర్మీ అని మార్చుకొని, ఇప్పుడు సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా గుర్తింపును అందించింది. అంతేకాదు ఈ సినిమా సీక్వెల్ పుష్ప -2 త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలను మెగా అభిమానులు తప్పుపడుతూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తాజాగా కిస్ కిస్ కిస్సిక్ అంటూ స్పెషల్ సాంగ్ను చెన్నైలో.. ఈవెంట్ ఏర్పాటు చేసి మరి విడుదల చేశారు. అయితే ఈవెంట్ అనంతరం కిస్ కాదు అంటూ ఒక పోస్టర్ని విడుదల చేశారు. అయితే ఆ ఫోటో వెనకాల ఏం పీకలేరు అన్నట్టు బ్లర్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానులకు టార్గట్టుగా పెట్టినట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే అల్లు అర్జున్ వెంటనే ఆ పోస్టుని.. డిలీట్ చేయడం జరిగింది. అదే ప్లేస్ లో వెనక ఉన్న పోస్టర్ కట్ చేసి మరో స్టేటస్ పెట్టారు ఈ హీరో. ఇక ఇది చూసిన కొంతమంది నిజంగానే అల్లు అర్జున్ మెగా అభిమానులకు భయపడ్డారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప -2 విడుదల సమయంలో ఇలాంటివి చేయడం అవసరమా అంటూ బన్నీ అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.