Pushpa 2 Ticket Rates hike: ‘పుష్ప 2’ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. భారీగా టికెట్ రేట్ల పెంపు..!
Pushpa 2 Ticket Rates hike: ఆదివారం బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జనాలు పోటెత్తారు. ఓ దక్షిణాది భాషకు చెందిన హీరోకు బాలీవుడ్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అనే రీతిలో అభిమానులు హాజరయ్యారు. మరోవైపు అంచనాలకు మించిన ప్రేక్షకులు రావడంతో పోలీసులు లాఠీకి పని చెప్పాల్సి వచ్చింది.
పుష్ప 2 ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేసిన ట్రైలర్ కు అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ సినిమా చూడాలని కోరుకుంటున్న అభిమానులకు షాక్ ఇచ్చేలా ఈ సినిమా టికెట్ రేట్స్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెంచబోతున్నట్టు తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలున్నాయి. మరోవైపు ఏపీలో ఈ సినిమా కోసం ఎంత మేర పెచ్చుకునేందుకు అనుమతులు ఇస్తారనేది చూడాలి.
మరోవైపు అల్లు అర్జున్ , మెగా ఫ్యామిలీ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. కానీ మైత్రీ వాళ్లకు డైరెక్ట్ గా బాలయ్య, పవన్ కళ్యాణ్ లతో మంచి అనుబంధం ఉంది. పైగా అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్ షో’తో బాలకృష్ణతో మంచి ర్యాపో ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్లు రేట్లు పెంపు పెద్ద కష్టం కాకపోవచ్చు.
ప్రస్తుతం ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేట్లు రూ. 150- రూ. 200 మధ్య ఉంది. పుష్ప 2 కోసం రూ. 300 వరకు పెంచుకునేందుకు అనుమతులు కోరినట్టు తెలుస్తోంది. పైగ ఆరు షోలతో పాటు బెనిఫిట్ షోలకు స్పెషల్ పర్మిషన్స్ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అయితే.. పుష్ప 2 టికెట్స్ రేట్స్ పెంచడం వలన .. అభిమానులు ఎలాగో చూస్తారు. ఫ్యామిలీస్.. కామన్ ఆడియన్స్ మాత్రం సినిమా బాగున్నా.. వారి ఆర్ధిక పరిస్థితిని బట్టి టికెట్ రేట్స్ తగ్గే వరకు వెయిట్ చేస్తారు.
మొత్తంగా ఈ టికెట్ రేట్స్ పెంపు అనేది మూడు రోజులకే పరిమితం చేస్తే బాగుంటుందనేది టాక్. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. ఒక్క హిందీలోనే రూ. 200 కోట్ల వరకు చేసినట్టు టాక్. మొత్తంగా ఈ సినిమా హిట్టు కొట్టాలంటే.. రూ. 600 కోట్ల షేర్.. రూ. 1000 కోట్ల గ్రాస్ అందుకోవాల్సిందే. పైగా ప్రపంచ వ్యాప్తంగా 11500 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. అందులో మన దేశంలో 6500 స్క్రీన్స్.. విదేశాల్లో 5 వేలకు స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
మొత్తంగా పుష్ప 2 ట్రైలర్ తోనే మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మరోవైపు హిందీలోనే మొదటి రోజు రూ. 50 కోట్ల నుంచి రూ. 60 కోట్ల మధ్య నెట్ వసూళ్లు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం .. బాలీవుడ్ లో మరో బాహుబలి, ఆర్ఆర్ఆర్ లా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ సాధించే అవకాశాలు లేకపోలేదు.