Sobhita Dhulipala: అప్పుడు అమల.. ఇప్పుడు శోభితా దూళిపాళ్ల.. అక్కినేని ఫ్యామిలీలో అదే కామన్ పాయింట్..
Sobhita - Amala Akkineni: శోభితా ధూళిపాల, నాగ చైతన్య గత కొన్నేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అంతేకాదు కొన్నేళ్లుగా వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు. నిన్న గురువారం వీళ్లిద్దరు పండితులు నిర్ణయించిన ముహూర్తంలో పెద్దల సమక్షంలో నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారు.
చైతూ, శోభితాలు నిశ్చితార్ధ ముహూర్తం చాలా బలమైనదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో నిశ్చితార్థం కానీ.. పెళ్లి కానీ చేసుకుంటే జీవితాంతం కలిసి ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే చైతూ, శోభితా కూడా జీవితాంతం కలిసి జీవించాలని వాళ్ల అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే.. అక్కినేని నాగ చైతన్య భార్యగా అక్కినేని మూడో తరంలో ఈమె రెండో భార్యగా అడుగుపెట్టబోతుంది. అంతకు ముందు అమల కూడా నాగార్జున రెండో భార్యగా అక్కినేని కుటుంబంలో కుడి కాలు మోపింది.
అమల మరియు శోభితా ధూళిపాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అమలా వాళ్లది ..శోభితాది ఇద్దరిది ఒకటే సామాజిక వర్గం అనే చర్చ నడుస్తోంది. వీళ్లిద్దరు వేరు వేరు ప్రాంతాల సంబంధించి ఒకే అగ్రకులానికి చెందిన వాళ్లు. అమల వాళ్ల ఫాదర్ ది బెంగాల్ కు చెందినవారతై.. శోభితా మాత్రం అచ్చ తెలుగు ఆడపడచు.
అయితే.. నాగార్జున, అమల కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ నాగ చైతన్య, శోభితా మాత్రం ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా.. ఏడడుగులు వేయబోతున్నారు.
త్వరలో నాగ చైతన్య, శోభితా వెండితెరపై జోడి కడితే బాగుంటుందని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వాళ్ల ఆశలను చైతూ, శోభితా తీరుస్తారా అనేది చూడాలి.