Amala Paul: బేబి బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో అమలా పాల్ రచ్చ..
అమలా పాల్ తెలుగులో నటించింది కొన్ని సినిమాలే.. తనదైన నటన, అందంతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరించింది.
తమిళం, మలయాళంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా గర్భంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
అమలా పాల్ చేసిన సినిమాల కంటే తన యాటిట్యూట్‌తో వార్తల్లో నిలవడం ఆమె స్టైల్. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'బెజవాడ' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తెలుగులో రామ్ చరణ్ సరసన 'నాయక్', అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో నటించింది. కానీ టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకే కేవలం తమిళం, మలయాళ సినిమాలపై ఫోకస్ పెట్టి అక్కడ సక్సెస్ అయింది.
ఆ మధ్య తమిళ ఫేమస్ డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు మధ్య మనస్పర్ధలతో విడిపోయారు. ముందుగా ఏ.ఎల్. విజయ్ మరో పెళ్లి చేసుకోగా.. అమలా పాల్ లాస్ట్ ఇయర్ తన సహ నటుడు జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది.
అప్పట్లో జగత్ దేశాయ్‌తో అమలా పాల్ మ్యారేజ్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం అమలా పాల్ గర్భవతిగా ఉంది. అంతేకాదు గర్భంతో ఉన్న బేబి బంప్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. అమలా పాల్ కేవలం సినిమాలే కాదు... పలు వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది.