Curd And Cumin: పెరుగులో జీలకర్ర వేసి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఏంటో తెలుసా?
పెరుగు ప్రతి రోజు తీసుకుంటాం ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు మెరుగు చేస్తుంది. మలబద్ధక సమస్యను రాకుండా నివారిస్తుంది అలాగే జీలకర్ర కూడా జీర్ణక్రియకు ఎంతో తోడ్పడుతుంది.
పెరుగు జీలకర్ర కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్యకు ఎఫెక్టివ్ రెమిడిగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి జీర్ణ క్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అంతేకాదు కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల ఆకలి మందగిస్తుంది ఇలాంటి వారు పెరుగు జీలకర్ర పొడిని తీసుకోవడం వల్ల ప్రభావంతంగా పనిచేస్తుంది
పెరుగు జీలకర్ర కలిపి తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ప్రోత్సహిస్తుంది పెరుగులో ప్రిపయోటిక్స్ ఉంటాయి.పెరుగు జీలకర్ర కలిపి తీసుకోవటం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది కంటి చూపులు మెరుగు చేస్తుంది.
పెరుగు జీలకర్ర కలిపి తీసుకోవటం వల్ల ఇందులో ఉండే ఖనిజాలు ఉండే ఆరోగ్యానికి తోడ్పడుతాయి ముఖ్యంగా రక్తపోటును నియంత్రిస్తుంది ఇందులో మెగ్నీషియం ఉండటం వల్ల ఈ రెండింటిని ప్రతిరోజు తినవచ్చు.
డయాబెటిస్‌తో బాధపడేవారు పెరుగు జీలకర్ర పొడి వేసుకొని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి వారు తప్పకుండా తమ డైట్ లో చేర్చుకోవాలి. పెరుగు జీలకర్ర తీసుకోవటం వల్ల గుండ మంట సమస్య కూడా తక్షణ రెమెడీగా పనిచేస్తుంది ఇది కడుపును చల్లబరుస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)