Tea and Coffee: చాయ్, కాఫీలు తాగడం వల్ల కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..
చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీలు తాగకుండా.. అసలు రోజు స్టార్ట్ అయినట్లు భావించారు. పొరపాటున చాయ్ లేకుంటే.. ఆరోజు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు.
మరికొందరైతే.. బెడ్ మీద నుంచి లేవాలంటే... కాఫీ లేదా టీ ఉండాల్సిందే. ఆ తర్వాతే మంచం మీద నుంచి కాళ్లు బైటపెడతారు.
ఇదిలా ఉండగా.. పని ప్రదేశాల్లో చాలామంది అదే పనిగా టీలు, కాఫీలు తాగుతుంటారు. కాఫీలో ఉండే కెఫిన్ మనస్సును ఉత్తేజ పరుస్తుంది. అంతే కాకుండా.. నిద్రమత్తును పొగొడుతుంది.
చాలా మంది చాయ్ తాగగానే ఒకరకమైన ఒత్తిడి నుంచి బైటపడతారు. అందుకే టీ తాగాలని కూడా నిపుణులు చెబుతుంటారు. టీ తాగడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. టీ వల్ల కడుపులోని వ్యర్థ పదార్థాలు బైటకు మలం ద్వారా వెళ్లిపోతాయి.
లెమన్ టీ, పూదీనా టీ, తులసీ టీ తాగితే ఆరోగ్యంతో పాటు మెదడు కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజు చాయ్ లేదా కాఫీ తాగితే మంచిదని కూడా నిపుణులు చెబుతుంటారు.
అయితే.. అదే పనిగా టీలు లేదా కాఫీలు తాగడం వల్ల కొన్నిసార్లు చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. అందుకే ఏదైన లిమిట్ లో ఉంటే మంచిదని కూడా నిపుణులు సూచిస్తుంటారు.