Ghee benefits: నెయ్యిని చలికాలంలో ఇలా తింటే... కళ్లు చెదిరే లాభాలు మీ సొంతం..
మనలో చాలా మంది వేడి వేడి అన్నం మీద తప్పకుండా నెయ్యిని వేసుకుని తింటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండటంతో పాటు..శరీరంకు కావాల్సిన కార్బోహైడ్రేట్ లు అందుతాయి.
అయితే.. చలికాలంలో మాత్రం నెయ్యిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. దీని వల్ల మనం ఆరోగ్యంకు అదనపు లాభాలు చేకూరుతాయి.
నెయ్యిని ఒక గిన్నెలో వేసుకొవాలి. దాన్ని తినే ముందు సిమ్ మీద వేడి చేయాలి.ఆ తర్వాత మాత్రమే తినాలి. కానీ గడ్డగా ఉన్న నెయ్యిని మాత్రం అస్సలు తినకూడదు.
కొంత మంది గడ్డగా ఉన్న నెయ్యి తింటారు . దీనివల్ల గొంతు సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. నెయ్యిని గిన్నెలో వేసుకుని వేడి చేసి వేడివేడి అన్నం మీద కారంతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటుంది.
అన్నం, చప్పడి పప్పుతో కలిపి, ఉప్పు వేసి, నెయ్యితొ తింటే ఆ టెస్ట్ వేరప్పా అని చెప్పవచ్చు. అందుకే చాలా మంది నెయ్యిని వేడి చేసి, దానిలో చక్కెర వేసుకుని మరీ తింటారు. దీని వల్ల శరీరం కూడా యాక్టివ్ గా ఉంటుంది.