Amazon Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బంపర్ ఆఫర్లు ఇవే..

Thu, 24 Dec 2020-8:16 am,

Amazon Fab Phones Fest : స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఫోన్ ఫెస్టివల్ వచ్చేసింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ ఏడాదిని మరో మరో భారీ సేల్‌తో ముగించాలని నిర్ణయించుకుంది. దీంతో క్రిస్మస్ సందర్భంగా ‘అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ (Amazon Fab Phones Fest)ను తీసుకొచ్చింది. డిసెంబర్ 25 వరకు అమెజాన్ ఫ్యాబ్ ఫెస్ట్ జరగనుంది. స్మార్ట్ ఫోన్లు, యాక్ససరీస్‌పై గరిష్టంగా 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్ 

శామ్‌సంగ్ గెలాక్సీ M31, శామ్‌సంగ్ గెలాక్సీ M31Sతో పాటు శాంసంగ్ గెలాక్సీ M21 మోడల్స్‌పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. శామ్‌సంగ్ గెలాక్సీ M31S ధరను రూ.22,999 నుంచి రూ .19,499కు తగ్గించింది. 15శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ M31 భారీ డిస్కౌంట్ ప్రకటించింది. 6 జీబీ ర్యామ్, 6000mAH బ్యాటరీ గల మొబైల్ రూ.19,999 కాగా, ఈ మోడల్‌పై 18శాతం వరకు ధరలు తగ్గించింది. శాంసంగ్ గెలాక్సీ M31 (6 జీబీ + 128 జీబీ) విక్రయాలపై ప్రైమ్ మెంబర్స్‌కు రూ.1000 విలువైన అమెజాన్ కూపన్ అందిస్తోంది.

ఆండ్రాయిడ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు అయిన వన్‌ప్లస్ 8 (6 జీబీ + 128 జీబీ) మొబైల్స్‌పై ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ మొబైల్ ధర రూ.27,999 కాగా, దీనిపై రూ.1000 డిస్కౌంట్ అమెజాన్ ప్రకటించింది. దాంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌తో మరో రూ.500వరకు తగ్గనుంది.

Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

ఆండ్రాయిడ్‌ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన వన్‌ప్లస్ 8T మోడల్‌పై రూ.2000 వరకు తగ్గింపు ధర అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌తో బుక్ చేసే వారికి ఆఫర్ వర్తించనుంది. దీని ధర రూ.42,999

భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసిన రెడ్‌మి 9 పవర్ మొబైల్స్‌పై ఆఫర్ ప్రకటించింది. నాలుగు రంగులు Blazing Blue, Electric Green, Fiery Red, and Mighty Black రంగులలో రెడ్‌మి 9 పవర్ లభ్యం కానుంది. పూర్తి వివరాలకు అమెజాన్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

Also Read: Forbes 2020 Highest Paid Celebrities: బావను వెనక్కినెట్టి మరీ టాప్ లేపిన ముద్దుగుమ్మ!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link