Amazon Great Indian Festival Sale Dates: భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌తో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేస్తోంది

Sun, 24 Sep 2023-9:14 pm,

Amazon Great Indian Festival Sale Dates and Discounts: కొత్తగా మార్కెట్లోకి లాంచ్ కాబోయే 5G స్మార్ట్ ఫోన్స్ ఫస్ట్ సేల్‌తో పాటు ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోన్న ఎన్నో స్మార్ట్‌ఫోన్స్‌పై అమేజాన్ భారీ తగ్గింపు ఆఫర్స్ అందించనుంది అని సోషల్ మీడియాలో కనిపిస్తోన్న పోస్టులు చూస్తే అర్థం అవుతోంది. 

Amazon Great Indian Festival Sale Dates and Discounts: స్మార్ట్ ఫోన్స్ మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్స్‌, మొబైల్ యాసెసరీలు, మరీ ముఖ్యంగా ఈయర్ బడ్స్, సౌండ్ బార్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది.

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుండి ప్రారంభం కానుందని కొంతమంది టిప్‌స్టర్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన పోస్టులు చెబుతున్నాయి. 

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కి సంబంధించిన టీజర్‌ స్క్రీన్‌షాట్స్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్‌షాట్స్‌ని నిశితంగా పరిశీలిస్తే.. అందులో ఈ తేదీలు ఉండటం చూడవచ్చు. 

Amazon Great Indian Festival Sale Dates and Discounts: అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి ముందస్తు యాక్సెస్‌ అందిస్తూ అక్టోబర్ 9 అర్ధరాత్రి నుండే సేల్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Amazon Great Indian Festival Sale Dates and Discounts: టిప్‌స్టర్స్ ముకుల్ శర్మ, అభిషేక్ యాదవ్ ట్విటర్‌లో పోస్ట్ చేసిన డీటేల్స్ ప్రకారం.. రాబోయే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రోమో చూస్తే... స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇతర వస్తువులపై ఆకట్టుకునే డీల్స్ ఉండే అవకాశం ఉంది. 

Amazon Great Indian Festival Sale Dates and Discounts: ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లోనే శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫస్ట్ సేల్ కూడా ఉండే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link