AMB in Bengaluru: బెంగళూరు సిటీలో మహేష్ బాబు కొత్త మల్టీప్లెక్స్.. పిక్స్ వైరల్..
మహేష్ బాబు సినిమాల్లో తనకు వచ్చిన పారితోషకాన్ని సినిమాల్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు. తాజాగా బెంగళూరు సిటీలో AMB మల్టీప్లెక్స్ చైన్‌ను ఏషియన్ గ్రూపుతో కలిసి స్టార్ట్ చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ సిటీ శివారు గచ్చిబౌలిలో AMB పేరుతో మల్టీప్లెక్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే కదా.
చాలా మంది సినీ ప్రియులు ఈ మల్లీప్లెక్స్‌లో సినిమా చూడటం అనేది డ్రీమ్ గా పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం మల్టీప్లెక్స్‌తో పాటు షాపింగ్ మాల్ హోటల్ సహా అన్ని సదుపాయాలున్నాయి.
తాజాగా మహేష్ బాబు ఏషియన్ గ్రూపుతో కలిసి బెంగళూరు సిటీలోని మెయిన్ సెంటర్‌లో AMB పేరుతో మరో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసాడు.
ఈ బుధవారం AMB మల్టీప్లెక్స్‌ను బెంగళూరులో ఏషియన్ గ్రూపు అధినేత సునీల్ నారంగ్ ప్రారంభించారు.