Amex Card: లక్కీ భాస్కర్` సినిమా చూశారా? అందులో చూపించిన `అమెక్స్ కార్డ్` ప్రత్యేకతలేంటి?
American Express Credit Card : ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ అట్లూరీ ప్రేక్షకులకు చూపించిన తీరు నిజంగా చక్కగా ఉంది. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఇంటి బాధ్యతలను భుజాలపై వేసుకుని...తన కుటుంబం సంఘంలో మంచి స్థాయిలో ఉండాలని పరితపించే ఒక కుర్రాడి కలను చిత్రీకరించే విధానంగా అందర్నీ ఆకట్టుకుంది. స్కాములు ఎలా చేయాలి..కోట్ల డబ్బు ఎలా సంపాదించాలనే కాన్సెప్ట్ చక్కగా ఉంది.
అయితే ఇదంతా సినిమా. దీనికి గురించి కాకుండా ఈ సినిమాలో చివరిలో అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డ్ హైలేట్ చేశారు. ముగింపులో హీరో తన భార్యకు స్పెషల్ అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు అని చెప్పి ఇస్తాడు. ఇది లిమిట్ లేకున్నా వాడుకోవచ్చని చెబుతాడు. అసలు ఈ అమెక్స్ బ్లాక్ కార్డ్ ఏంటి. దీని వల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డ్ అనేది ప్రతిఒక్కరి దగ్గరా ఉంటుంది. చాలా మంది క్రెడిట్ కార్డు ద్వారా ప్రతిరోజూ ట్రాన్సాక్షన్స్ జరుపుతుంటారు. దానికి తోడు ట్రాన్సాక్షన్లు, సిబిల్ స్కోర్ ఇలా అన్ని బాగుంటేనే బ్యాంకు ఉద్యోగులే ఫోన్ చేసి మరీ క్రెడిట్ కార్డులను ఇస్తుంటారు. ఇలా ఇప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవడం చాలా సులభంగా మారింది.
అయితే అన్ని క్రెడిట్ కార్డులు వేరు అమెరికన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కార్డు వేరు. ఈ అమెరికన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కార్డు అందరికీ అందుబాటులో ఉండదు. దీన్ని పొందేందుకు కొన్ని రూల్స్ ఉంటాయి. అసలుకొత్తఅమెక్స్ సెంచూరియన్ బ్లాక్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఉండదు.
అమెరికన్ ఎక్స్ ప్రెస్ ద్వారా మాత్రమే ఈ క్రెడిట్ కార్డును దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు ఉన్నవారు వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికన్ ఎక్స్ ప్రెస్ క్రెడిట్ కార్డు పొందాలంటే మీరు ఏడాదికి కనీసం 1.5కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అంతేకాదు ఫీజులు,ఇతర చార్జీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
ఈ కార్డును పొందాలంటే రూ. 8.47 లక్షలు చెల్లించాలి. ఇది ఒకసారి చెల్లించే ఫీజు. ఆ మొత్తం డబ్బు కూడా మీ ఖాతాలోకి డిపాజిట్ అవ్వదు. ఇది అమెరికన్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేక కార్డుకు సంబంధించిన ఫీజు. ఒక సంవత్సరం ఫీజు రూ. 4.23 లక్షలు. సంవత్సరానికి 12.70లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
దీని ప్రత్యేకత ఏంటంటే మొత్తం చెల్లిస్తే ఈ కార్డు ఎందుకు అని మీరు షాక్ అవ్వచ్చు. కానీ ఈ కార్డు స్పెషాలిటి అమెరికన్ ఎక్స్ ప్రెస్ సర్వీసు ఏ దేశంలోనైనా అందుబాటులో ఉంటుంది. మీకు కావాల్సింది బుక్ చేసుకోవచ్చు. కార్డు హోల్డర్ తోపాటు కుటుంబానికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. వైద్య ఖర్చులను బీమా ద్వారానే కవర్ చేసుకోవచ్చు. లగ్జరీ హోటల్లు, విమానాలపై డిస్కౌంట్ కూడా ఉంటుంది.