Pawan Kalyan: కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న? ఏమని అడిగారో తెలుసా?

Sat, 14 Sep 2024-1:50 pm,

కౌన బనేగా కరోడ్‌ పతి ఈ షో ప్రస్తుతం సీజన్‌ 16 సోనీ ఛానల్‌ హిందీలో ప్రసారం అవుతుంది. అయితే, అన్ని ప్రశ్నల మాదిరి అమితాబ్‌ బచ్చన్‌ కంటెస్టెంట్‌ ను ప్రశ్నలను సంధిస్తారు. అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా నిర్వహిస్తున్నారు. కల్కీ సినిమాలో అశ్వథామా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు బిగ్‌ బీ.  

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న సినిమా హీరో పవన్ కల్యాణ్‌ ఎన్నో సినిమాలు చేశారు. టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడైన పవన్‌ సినిమాల్లో ఎంతో మంచి పేరు పొందారు. ముఖ్యంగా మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో ఓ చరిత్ర సృష్టించి పీఎం నరేంద్ర మోడీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు.  

ఏపీ ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను కూడా పవన్‌ దక్కించుకున్నారు. దీంతో ఈ పవర్‌ స్టార్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగి పోతుంది. డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న ఈయన పై కౌన్‌ బనేగా కరోడ్‌పతి షో లో కూడా ప్రశ్న అడిగారంటే ఏ రేంజ్‌లో డిప్యూటీ సీఎం పేరుపొందారో తెలుస్తుంది.  

అయితే, బిగ్‌ బీ అమితాబ్‌ కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షొలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు సంబంధించి ఓప్రశ్నను కంటెస్టెంట్‌ను అడిగారు. ప్రస్తుతం ఆ ప్రశ్న వైరల్‌గా మారింది. 2024 జూన్‌ ఏపీ ఎన్నికల్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?   

ఈ ప్రశ్నకు కంటెస్టెంట్‌ ఆడియన్స్‌ పోల్‌ తీసుకున్నారు. దీనికి ఎక్కువ శాతం మందికి పైగా పవన్‌ కల్యాణ్‌ అని కరెక్ట్‌ సమాధానం చెప్పారు. కంటెస్టెంట్‌ రూ.1.60 లక్షలు గెలిచారు. ఇక పవన్‌ కల్యాణ్‌ హరి హర వీరమల్లు ఓజీ, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వంటి సినిమాలు కూడా రానున్నాయి. ఇవి ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ప్రస్తుతం పవర్‌ స్థార్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link