Home Remedies: పొట్టనొప్పి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యలను చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కాలు..
తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉసిరి పొడిని కలుపుకొని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా పొట్ట నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల సులభంగా మలబద్ధకం జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఈ ఫైబర్ శరీర బరువును అదుపులో ఉంచేందుకు కూడా సహాయపడుతుంది.
పొట్ట సమస్యలతో బాధపడేవారు సోంపు నీరును కూడా తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలకు ప్రభావంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా జీర్ణాశయాన్ని రక్షిస్తాయి.
మలబద్ధకం, ఇతర జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నీటిని ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా మారడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
దాల్చిన చెక్క నీటిలో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల అనేక రకాల పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా తరచుగా మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దాల్చిన చెక్క నీటిని తీసుకోండి.