Amy Jackson Lover : అమి జాక్సన్ ప్రియుడ్ని చూశారా.. పబ్లిక్‌గానే ఇంత రొమాన్స్ చేస్తున్నారే?
విదేశీ భామ అయిన అమీ జాక్సన్‌కు తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఎక్కువ ఫేమస్ అయింది.
డైరెక్టర్ శంకర్‌తో రెండు సినిమాలు చేసింది అమీ జాక్సన్. ఐ, రోబో 2.ఓ అంటూ రెండు భారీ బడ్జెట్ చిత్రాలను చేశారు. కానీ ఆ రెండు కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు.
రామ్ చరణ్‌తో, ధనుష్‌తో ఇలా టాలీవుడ్ కోలీవుడ్ స్టార్లతో సినిమాలు చేసింది. కానీ ఏవీ కూడా తనకు ఆఫర్లను తీసుకొచ్చి పెట్టలేదు.
అమీ జాక్సన్ సినిమాలకు దూరంగా తన సొంత దేశానికివెళ్లింది. అక్కడే తన ప్రియుడితో లివ్ ఇన్ రిలేషన్‌ను స్టార్ట్ చేసింది. ఓ పాపను కూడా కనేసింది.
పెళ్లి కాకుండా తల్లి అయింది అమీ జాక్సన్. ఈ ఇద్దరూ విడిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు షేర్ చేసిన ఫోటోలతో వీరి బంధం పదిలంగానే ఉన్నట్టు తెలుస్తోంది.