Anant Ambani: కొత్త జంట అనంత్ అంబానీ, రాధిక.. గణేశుడికి 20 కిలోల బంగారు కిరీటం కానుక
20kg Gold Crown: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం జూలై 12వ తేదీన రాధికా మర్చంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లితో అంబానీ కుటుంబానికి భారీగా కలిసొచ్చింది. ముఖ్యంగా రాధిక రాకతో వ్యాపారంగా మరింత కలిసొస్తుంది.
20kg Gold Crown: అంబానీ కుటుంబానికి ముంబైలోని లాల్ బాగ్‌చా రాజా గణేశ్ ఆలయంలో విడదీయరాని బంధం ఉంది.
20kg Gold Crown: పెళ్లి తర్వాత తొలిసారి జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా లాల్‌బగ్‌చా రాజా ఆలయాన్ని అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ దంపతులు దర్శించుకున్నారు.
20kg Gold Crown: ఈ సందర్భంగా తమ ఇష్టదైవానికి 20 కిలోల మేలిమి బంగారంతో తయారుచేయించిన కిరీటాన్ని వినాయకుడికి బహూకరించారు.
20kg Gold Crown: ప్రత్యేక పూజల అనంతరం వినాయకుడికి బంగారు కిరీటం నిర్వాహకులు ధరిపజేశారు.
20kg Gold Crown: అయితే అనంత్, రాధిక ఇచ్చిన బంగారం కిరీటం ధర వింటే షాకవుతారు. దాదాపు రూ.15 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
20kg Gold Crown: ప్రస్తుతం వినాయక చవితి వేళ అనంత్ అంబానీ సమర్పించిన బంగారు కిరీటంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.