Real Estate: హైదరాబాద్లో ఇళ్లు కొనడం అంత ఈజీ కాదు..ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే
Real Estate: సామాన్య, మధ్య తరగతి ప్రజలకు సొంతిళ్లు ఒక కల. సొంతింటిని నిర్మించుకునేందుకు రూపాయి రూపాయి పోగు చేస్తుంటారు. పల్లెల్లో అయితే ఇళ్లు కట్టడం కాస్త సాధ్యమే. కానీ హైదరాబాద్ వంటి నగరంలో ఇళ్లు కొనుగోలు చేయడం సవాల్ తో కూడుకుంది. ఎందుకంటే రోజు రోజుకీ పెరిగే ధరలు, మార్కెట్ పరిస్థితులు, ఆర్థికపరిస్థితులు, నిర్మాణం, లాండ్ ఏరియాం, ప్రభుత్వ విధానాలు, ఆదాయం, వినియోగదారుల డిమాండ్ ఇవన్నీ కూడా ఇళ్ల కొనుగోలుపై ప్రభావం చూపుతాయి.
హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ హబ్ లు, ట్రాన్స్ పోర్టు హబ్స్, ప్రధాన ప్రాంతాల్లో ఆస్తి ధరలు గత కొంతకాలంగా వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న స్థలం కొనాలన్నా కోట్లు ఖర్చు చేయాల్సిందే. ధరలు పెరుగుతున్నా...వాటి డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఇక స్థిరాస్తి కన్సల్టెన్సీ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ ఆర్థిక ఏడాది మనదేశంలో ప్రధాన 7 నగరాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల ధరలు సగటున రూ. 1.23 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే విలువ రూ. 1కోటిగా ఉండేది. అంటే దాదాపు 23శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2023-24లో ధర తక్కువగా ఉంది. ఈ ధరలు కోవిడ్ పరిణామాల వల్ల పెరిగిందని అంచనా వేసింది.
2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం మన దేశ ముఖ్య నగరాల్లో రూ. 2, 79,309కోట్ల విలువైన 2,27,400 ఇళ్లు, ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. గతేడాది రూ. 2, 35,800 విలువైన 2,35,200 ఇళ్లు, ప్లాట్లు కొన్నారు. దేశంలో ఇళ్ల అమ్మకంలో హైదరాబాద్ నగరం కీలకమైంది.
2023-24లో ఇళ్ల సగటు ధర రూ. 84 లక్షలు ఉండగా..2024-25 మొదటిలోనే ఈ ధర రూ. 1.15 కోట్లకు చేరుకుంది. అంటే ఇళ్ల ధరలు 37శాతం పెరిగాయి.
ఈ ఏడాది కొనుగోలు చేసిన ఇళ్ల సంఖ్య 28, 940నుంచి 27,820కి తగ్గింది. వాటి విలువ మాత్రం రూ. 25, 059కోట్ల నుంచి రూ. 31, 983 కోట్లకు పెరగడం ఊహించని విషయమేనని చెప్పవచ్చు. ధరలు భవిష్యత్తుల మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.