Anasuya Bharadwaj: వివాదంలో అనసూయ.. భర్త ముందే అలా ప్రవర్తిస్తావా..! మరోసారి నెటిజన్స్ కు టార్గెట్ గా జబర్ధస్త్ బ్యూటీ..
జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టీవీ తెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆపై సిల్వర్ స్క్రీన్ పై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
జబర్దస్త్ భామ యాంకర్ అనసూయ గురించి కొత్తగా పరిచయాలు పనిలేదు. యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత సినిమాల్లో వరుస అవకాశాలు కొట్టేసింది. తాజాగా ఈమె తన భర్త ముందే ఓ వ్యక్తికి కేక్ తినిపించడాన్ని కొంత మంది నెటిజన్స్ అనసూయ తీరును ఏకి పారేస్తున్నారు.
అయితే తెలిసిన వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఆప్యాయంగా కేక్ అనిపించడం తప్పేమి లేదు. దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సి అవసరం లేదంటున్నారు. అతను అనసూయ సోదరుడు వరస కూడా కావొచ్చనే కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అనసూయ చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేకపోయినా.. కొంత మంది మాత్రం ఎందుకు ఈ విషయాన్ని వివాదం చేస్తున్నారంటున్నారు.
ఏది ఏమైనా అనసూయ కొంత మంది కావాలనే ఈ భామను టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనసూయ విషయానికొస్తే.. కెరీర్ మొదట్లో టీవీ న్యూస్ యాంకర్‌గా.. ఆపై జబర్దస్త్ షో యాంకర్ గా పాపులర్ అయింది. అంతేకాదు వీలైనపుడల్లా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
జబర్దస్త్ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అంతేకాదు అక్కడ స్క్రీనింగ్ పై తన యాక్టింగ్ తో ఫిదా చేసి ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్ గా మారింది.
అనసూయకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం సుకుమార్, రామ్ చరణ్ ల ‘రంగస్థలం’. ఈ సినిమాతో రంగమ్మత్తగా తన యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.రంగస్థలం తర్వాత పుష్ప సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో అలరిస్తోంది అనసూయ. త్వరలో పుష్ప 2 మూవీతో అలరిస్తోంది.ఈ సినిమా డిసెంబర్ 6న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.