Anasuya Bharadwaj Photoshoot : పొద్దు తిరుగుడు పువ్వులా అనసూయ.. పూలతోటలో సోయగాల పరిమళం
బుల్లితెర, వెండితెరపై అనసూయకంటూ ఓ మార్క్ ఉంది. ఆమె క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరిని అడిగినా చెబుతారు.
రంగమ్మత్తగా వెండితెరపై నటిగా సత్తా చాటుతూనే.. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా సాటి లేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
అనసూయ ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరమైనట్టు అనిపిస్తోంది. ఆమె తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీదే పెట్టేసింది.
అనసూయ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తోంది.
తాజాగా అనసూయ సన్ ఫ్లవర్ తోటలో మెరిసింది. పూల కంటే అందంగా కనిపిస్తున్న అనసూయను చూసి సూర్యుడు కూడా ఆమె చుట్టూ తిరిగేలా ఉన్నాడు.